‘అజ్ఞాతవాసి’ ప్రివ్యూ…

Agnathavasi Movie Preview

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  పవన్ కళ్యాణ్, అను  ఇమ్మానుయేల్, కీర్తి  సురేష్,  కుష్బూ 
నిర్మాత: రాధాకృష్ణ  
దర్శకత్వం : త్రివిక్రమ్ 
సినిమాటోగ్రఫీ: మనికందన్ 
ఎడిటర్ :  కోటగిరి వెంకటేశ్వరరావు 
మ్యూజిక్ : అనిరుద్ రవిచందర్ 

మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు, సినీ వర్గాల వారు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్‌ 25వ చిత్రం అవ్వడంతో పాటు, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అవ్వడంతో అంచనాలు మొదటి నుండి కూడా ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు మరియు టీజర్‌, ట్రైలర్‌లు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. ఓ రేంజ్‌లో ఈ చిత్రం ఉంటుందని, బాహుబలి రికార్డులను కూడా బద్దలు కొట్టే రేంజ్‌ ఈ చిత్రానికి ఉందని, తెలుగులో నెం. 2 లేదా నెం.3 చిత్రంగా నిలవడం ఖాయం అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ముఖ్యంగా హైదరాబాద్‌లో సంచలన రీతిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్‌ సినిమా కూడా విడుదల కానన్ని థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇక ప్రఖ్యాత యూనివర్శిల్‌ స్టూడియోలో కూడా ఈ చిత్రాన్ని విడుదలకు ఏర్పాట్లు చేశారు. అమెరికాలో ఈ చిత్రం అయిదు మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేయడం ఖాయం అంటూ మేకర్స్‌ గట్టి నమ్మకంతో ఉన్నారు. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే చిత్రంలా ‘అజ్ఞాతవాసి’ ఉంటుందని మెగా ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.

పవన్‌కు జోడీగా ఈచిత్రంలో కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌లు హీరోయిన్స్‌గా నటించారు. రావు రమేష్‌, మురళి శర్మ, ఖుష్బులు ముఖ్య పాత్రలో నటించారు. దాదాపు 150 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను చేసిన ఈ చిత్రం 250 కోట్ల వసూళ్లను సాధిస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’, ‘కాటమరాయుడు’ చిత్రాలతో నిరాశ పర్చిన పవన్‌ ఈ చిత్రంతో అయినా సక్సెస్‌ సాధించి ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేసేలా చేస్తాడో లేదో చూడాలి.