Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ కీర్తి సురేష్ మరియు అను ఇమ్మానుఎల్ హీరో హీరోయిన్లు గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ కి ‘అజ్ఞాతవాసి’ 25 వ చిత్రం అవ్వటంతో పాటు, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వెళుతున్న కారణంగా ఇంకా పవన్ కళ్యాణ్ నటించే లాస్ట్ సినిమా అనుకుంటున్న నేపధ్యంలో డైరెక్టర్ త్రివిక్రమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు…
ఇప్పటికే రిలీజ్ అయిన అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అందించిన రెండు పాటలు ఒక్కరోజులోనే 1 మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్నది అంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో అర్ధమవుతోంది. ఈరోజు అజ్ఞాతవాసి మూవీ టీజర్ రిలీజ్ కాబోతున్న సందర్భంలో పవన్ ఫాన్స్ ఇప్పటికే ప్రత్యేకమైన లార్జ్ స్క్రీన్స్ ను ఏర్పాటు చేసారు. కొంతమంది ఫాన్స్ బైక్ రేస్ లతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇంకొంతమంది ఫాన్స్ పవన్ కళ్యాణ్ ఫొటోస్ కి పాలాభిషేకం చేస్తున్నారు. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ మూవీ టీజర్ మీఅందరికోసం.. మీరు కూడా ఒక లుక్ వేయండి