Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రం అజ్ఞాతవాసి గత నెలలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న అజ్ఞాతవాసి చిత్రాన్ని అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది. నైజాం ఏరియాలో దాదాపు 25 కోట్లకు చిత్రాన్ని దిల్‌రాజు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అన్ని ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పలేదు. దాంతో పవన్ కళ్యాణ్ తన పారితోషికంలో కొంత మొత్తంను తిరిగి ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా పారితోషికంలో కొద్ది మొత్తంను తిరిగి ఇవ్వడం జరిగింది. దాంతో నిర్మాత డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్ చేసే పనిలో ఉన్నాడు.
అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లతో పోల్చితే నైజాం ఏరియాలో దిల్‌రాజు భారీగా 14 కోట్ల మేరకు నష్టపోయినట్లుగా లెక్క తేలింది. అందుకే దిల్‌రాజుకు వచ్చిన నష్టంను సగం మేరకు భరించేందుకు నిర్మాత రాధాకృష్ణ ఓకే చెప్పారు. నైజాం ఏరియా నష్టంలో సగం అంటే ఏడు కోట్లను దిల్‌రాజుకు తిరిగి ఇచ్చేందుకు నిర్మాత ఓకే చెప్పడంతో లెక్క సెటిల్ అయ్యిందని సమాచారం అందుతుంది. ఇలా డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను భరించే అవసరం నిర్మాతలకు లేదు. కాని అజ్ఞాతవాసి చిత్రం పవన్ కళ్యాణ్‌పై నమ్మకంతో ఎక్కువ మొత్తం పెట్టి తీసుకోవడంతో, ఆయన తిరిగి ఇవ్వాలని నిర్మాతను కోరడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాత రాధాకృష్ణ తీసుకున్న నిర్ణయంను ఇతర నిర్మాతలు తప్పుబడుతున్నారు. ఇలా డిస్ట్రిబ్యూటర్లకు నష్టం భరించుకుంటూ పోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. అజ్ఞాతవాసి డిస్ట్రిబ్యూటర్ల మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.