Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఇప్పుడు హీరోగా వెలిగిపోతున్నారు. ప్రధాని మోడీకి దేశంలో క్రేజ్ పెరుగుతుంటే.. విదేశాల్లో ధోవల్ అభిమాన సంఘాలు తయారయ్యాయి. మోడీతో చెప్పుకోలేని విషయాలు కూడా ధోవల్ తో చెప్పడానికి విదేశాలు ముందుకొస్తున్నాయి. మోడీ రక్షణ, విదేశాంగ విధానాలకు ఆయనే కీలకమని అన్ని దేశాలకూ తెలిసిపోయింది.
సర్జికల్ స్ట్రైక్స్ కు ప్లాన్ చేసిన ధోవల్.. ఇప్పుడు ధోక్లాంలో తెగబడ్డారని చైనా మీడియా ఆడిపోసుకుంటోంది. మొత్తానికి సానుకూలంగానో, వ్యతిరేకంగానో చైనాలో ఆయనకు ఇప్పటికే క్రేజ్ పెరిగిపోయింది. కానీ చైనా అధికార పార్టీ నేతలు మాత్రం ధోవల్ పర్యటన ఉద్రికత్తల్ని తగ్గిస్తుందని ఆశపడుతున్నారు. దౌత్య సంబంధాల్లో ధోవల్ సీనియర్ కావడంతో.. ఏదో ఒకటి తేలుస్తారని ఇండియాలో ఆయన ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.
కానీ చైనా కోరుతున్నట్లు సైనికుల్ని ఉపసంహరిస్తే మనం తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే. అదే విధంగా చైనా తన బలగాల్ని వెనక్కిజరిపినా ఢోక్లాంపై హక్కు వదులుకున్నట్లే. ఇంత సున్నితంగా ఉన్న ఈ సమస్యను ధోవల్ ఎలా పరిష్కరిస్తారనేది పెద్ద ప్రశ్నే.
మరిన్ని వార్తలు: