అఖిల్‌ సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నాడు!!

Akhil akkineni focusing on low budget movies

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ హీరోగా ఇప్పటి వరకు వచ్చిన రెండు సినిమాలు ‘అఖిల్‌’ మరియు ‘హలో’ చిత్రాలు ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యాయి. ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన ఆ చిత్రాలు భారీ బడ్జెట్‌తో రూపొందడంతో నిర్మాతలు నష్టాలపాలయ్యారు. దాంతో అఖిల్‌ ఇకపై సేఫ్‌ గేమ్‌ ఆడేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ప్రస్తుతం తాను ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న చిత్రాన్ని 20 కోట్ల లోపు బడ్జెట్‌తో చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలకు ముందే 20 కోట్ల బిజినెస్‌ చేసే అవకాశం ఉంది. దాంతో నిర్మాత సేఫ్‌ అయ్యే అవకాశం ఉంది.

Akhil akkineni focusing on low budget movies

‘మిస్టర్‌ మజ్ను’ తర్వాత కూడా అఖిల్‌ అదే రేంజ్‌లో అంటే 20 కోట్ల లోపు బడ్జెట్‌తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘కుమారి 21ఎఫ్‌’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్న సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో అఖిల్‌ మూవీ చేయబోతున్నాడు. సుకుమార్‌ శిష్యుడు అయిన సూర్య ప్రతాప్‌ ఒక మంచి సబ్జెక్ట్‌తో ఇప్పటికే అఖిల్‌కు వినిపించాడు. దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు, రత్నవేలు ఈ చిత్రానికి వర్క్‌ చేయబోతున్నారు. ఈ చిత్రంతో పాటు ఆది సోదరుడి దర్శకత్వంలో అఖిల్‌ ఒక సినిమా చేయబోతున్నాడు. తక్కువ బడ్జెట్‌లో సంవత్సరంలో రెండు మూడు సినిమాలు చేయాలనేది అఖిల్‌ ఆలోచన. కొన్ని సక్సెస్‌లు దక్కిన తర్వాత భారీ బడ్జెట్‌ చిత్రాల జోలికి వెళ్లాలి అనేది అక్కినేని వారి ఆలోచనగా తెలుస్తోంది. అఖిల్‌ నిర్ణయం బాగుందని సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.