రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు పెద్దలు నిజమే ఇందుకు ఎన్నో తార్కాణాలు మనం ఇంతకు మునుపు చూశాం. అయితే ఇప్పుడు రాజకీయాలు చాలా మారాయి. భర్త ఒక పార్టీ బార్య ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ తండ్రి ఒక పార్టీ, అన్న ఒక పార్టీ తమ్ముడొక పార్టీ ఇలా సాగుతూ రాజకీయాలు వేరు, వ్యక్తిగతాలు వేరు అనే ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పుడు ఇంతకీ సంగతి ఏంటంటే ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి ఏపీ ఏపీ పర్యాటక మంత్రి అఖిల ప్రియ వెళ్లనున్నారు. అదేంటి అనుకుంటున్నారా ? నిజమే ఆమె జగన్ ఇంటికి వెళ్లనున్నారు, జగన్ ఫ్యామిలీకి భూమా ఫ్యామిలీకి మధ్య ఉన్న బంధుత్వం గురించి తెలిసిందే కదా గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ అయిన కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడితో అఖిల ప్రియకు వివాహం కూడా అయ్యింది కానీ వారిద్దరి మధ్య విబేధాలు రావడంతో కొన్ని రోజులకే ఇద్దరూ విడిపోయారు.
అయితే అఖిలప్రియ మాజీ డిజిపి సాంబశివరావు మాజీ అల్లుడు, ఏపీ మంత్రి నారాయణ అల్లుడి తమ్ముడు భార్గవ్ ను రెండో వివాహాం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారిద్దరి నిశ్చితార్ధం కూడా జరిగింది. అయితే ఇప్పుడు పెళ్లి కార్డు ఇచ్చి .తన పెళ్ళికి జగన్ ఫ్యామిలీని పిలవడానికి అఖిల ప్రియ జగన్ ఇంటికి వెళ్లనున్నారు. ప్రస్తుతం జగన్ పాదయాత్రలో ఉండటంతో కుటుంబ సభ్యులకు అఖిలప్రియ తన పెళ్లి శుభలేఖను అందించనున్నారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు, గవర్నర్ నరసింహన్‌కు కూడా శుభలేఖలు అందజేశారు అఖిల ప్రియ.