Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Akkineni Nagarjuna To Join YSRCP
అప్పట్లో వైఎస్ హయాంలో ఓ ప్రచారం బాగా జరిగింది. సినీ నటుడు నాగార్జున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని. ఎప్పుడూ లేని విధంగా ఆయన ప్రభుత్వ యాడ్స్ లో కనిపించడంతో పుకార్లకు బలం వచ్చింది. అయితే నాగార్జున ఆ రూమర్లు కొట్టిపడేశారు. తర్వాత ఎన్ కన్వెన్షన్ వ్యవహారం కోసమే ఆ యాడ్లు చేశారని తేలింది. ఇప్పుడు జగన్ పార్టీలో నాగ్ చేరతారని ప్రచారం షురూ అయింది. కానీ నాగార్జున జగన్ పార్టీలే చేరే సీనుందా అనేది పెద్ద ప్రశ్నే.
నాగార్జునకు కేసీఆర్ తో అవసరం ఉంది కానీ. జగన్ తో లేదు. జగన్ సమీప భవిష్యత్తులో అధికారంలోకి రారని ఆయనకు తెలుసు. పక్కగా బిజినెస్ లెక్కలు వేసే నాగార్జున అంత సాహసం ఎందుకు చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. తమ పార్టీకి క్రేజ్ తెచ్చుకోవడానికి నాగార్జునను లాగుతున్నట్లుగా పోజిస్తున్నారని వైసీపీపై విమర్శల వర్షం కురుస్తోంది. మరి జగన్ మాత్రం ఈ విషయంపై సైలంట్ గా ఎందుకు ఉంటున్నారనేద అర్థం కాని విషయం.
శిల్పా వస్తారని ముందుగానే హడావిడి చేసిన జగన్.. నాగ్ లాంటి స్టార్ వస్తుంటే మౌనం పాటిస్తారా అనేది అనుమానమే. దీంతో ఇవి వైసీపీ చీప్ ట్రిక్సేనని తేలిపోయింది. పైగా నాగార్జునకు జగన్ తో అవసరమేంటనే ప్రశ్నకు ఇంతవరకూ సమాధానం లేదు. పైగా వైఎస్ ఉన్నప్పుడే ఆయన పంచకు చేరని నాగ్.. జగన్ ను నమ్మి ముందడుగేస్తారనుకోవడం అత్యాశే.
మరిన్ని వార్తలు: