యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తున్న విషయం తెల్సిందే. ‘ఇండియన్ 2’ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ సీక్వెల్లో కమల్ హాసన్ నటించబోతున్నాడు. కమల్ తో పాటు ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ మరియు శింబులు కూడా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ చిత్రంకు బాలీవుడ్లో భారీ మార్కెట్‌ను క్రియేట్ చేసేందుకు బాలీవుడ్ స్టార్‌ను విలన్‌గా నటింపజేయాలని శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
నిన్న మొన్నటి వరకు ఈ చిత్రంలో అజయ్ దేవగన్ విలన్‌గా నటిస్తాడనే వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విలన్ పాత్రను అక్షయ్ కుమార్ పోషించబోతున్నాడట. ఇప్పటికే శంకర్ 2.ఓ చిత్రంలో అక్షయ్ విలన్‌గా నటించిన విషయం తెల్సిందే. 2.ఓ విడుదల కాకుండానే మరోసారి అక్షయ్, శంకర్ల కాంబోలో మరో మూవీ ఫిక్స్ అయ్యింది. ఇండియన్ 2లో అక్షయ్ కుమార్ దాదాపుగా ఫైనల్ అయినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ నుండి చిత్రాన్ని రెగ్యులర్ షూటింగ్‌కు తీసుకు వెళ్లబోతున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా కాజల్‌ను ఎంపిక చేసిన శంకర్ కీలక కమెడియన్ పాత్రకు తెలుగు స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.