Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సదావర్తి సత్రం భూములకు డబ్బులు జమ చేసే గడువు దగ్గరికి వస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల పెనుమాకలో రాజధాని రైతుల ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఆ టైం లో రైతుల అభిప్రాయాలు మినిట్స్ బుక్ లో రాయాలంటూ అధికారులతో ఆర్కే ఘర్షణకు దిగారు. దీనికి సంబంధించి అప్పట్లో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో ఇప్పుడు ఆర్కే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది సర్కార్ కక్ష సాధింపుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఓటుకి నోటు, సదావర్తి భూముల కేసుల్లో న్యాయ పోరాటాన్ని అస్త్రంగా మలుచుకుని టీడీపీ సర్కార్ ని ఇబ్బంది పెట్టడం వల్లే అధికార పార్టీ కక్ష తీర్చుకుంటోంది ఆర్కే కూడా ధ్వజమెత్తారు. రైతుల అభిప్రాయాన్ని మినిట్స్ బుక్ లో రాయమని డిమాండ్ చేయడంలో తప్పేముందని ఆయన నిలదీస్తున్నారు. మరో వైపు సదావర్తి భూములకి సంబంధించి ఆర్కే మొత్తం ఇరవై ఎనిమిది కోట్లకి పైగా నగదు రెడీ చేసుకోవాల్సి వుంది. ఈ పరిస్థితుల్లో ఆర్కే అరెస్ట్ ప్రభావం సదావర్తి భూములకు సమకూర్చవలసిన అమౌంట్ మీద పడుతుందని వైసీపీ ఆదుర్థాపడుతోంది. ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది.