నరేష్‌ మరోటి చూసుకోవడం బెటర్‌

Allari Naresh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లరి నరేష్‌ కెరీర్‌ ఆరంభంలో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కాని గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఒక్కటి అంటే ఒక్క సక్సెస్‌ కూడా అల్లరోడికి దక్కింది లేదు. తాజాగా మరోసారి అల్లరి నరేష్‌ ‘మేడ మీద అబ్బాయి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో అయినా ప్రేక్షకులను అలరించి, ఫామ్‌లోకి రావాలని అల్లరి నరేష్‌ కోరుకున్నాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు. సినిమా ప్రమోషన్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కాని అల్లరి చాలా రొటీన్‌గా ఉందని, ఇంకా కూడా అప్పటిలా అ్లరి చేస్తే మేం చూడలేం అంటూ ప్రేక్షకులు తేల్చి పారేశారు.

అల్లరి నరేష్‌ ఈ సినిమా కూడా ఫ్లాప్‌ అవ్వడంతో తన తండ్రి మాదిరిగా దర్శకత్వం వైపు అడుగులు వేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. గతంలో పలు సందర్బాల్లో తన తండ్రిలా మంచి సినిమాలు తీయాలని కోరిక ఉందని, అయితే అందుకు చాలా సమయం ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అల్లరి నరేష్‌ తన రూటు మార్చుకోవాల్సిన టైం వచ్చిందని, హీరోగా చేయడం మానేసి దర్శకత్వంలో ప్రయత్నించాలని సన్నిహితులు కూడా సలహా ఇస్తున్నారు. మరి అల్లరోడు ఇంకా కొంత కాలం హీరోగానే ప్రయత్నించి, ఆ తర్వాత దర్శకత్వం చేస్తాడా లేక హీరోగా తాను సక్సెస్‌ కాలేను అని వదిలేసి దర్శకత్వం చేస్తాడా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు