Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Allu Arjun ‘ DJ ‘ Duvvada Jagannadham Censored
అల్లు అర్జున్, హరీష్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కిన వివాదాస్పద చిత్రం ‘డీజే’ విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ను ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంలో బ్రహ్మణులను కించపర్చే సీన్స్ ఉన్నాయంటూ మొదటి నుండి కూడా బ్రహ్మణ సంఘాల వారు ఆందోళన చేస్తున్నారు. సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. అయితే సెన్సార్ బోర్డు మాత్రం బ్రహ్మణులను కించపర్చే విధంగా ఈ సినిమాలో ఎలాంటి సీన్స్ లేవు అని తేల్చి క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది.
సెన్సార్ కంప్లీట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మరో వైపు బ్రహ్మణ సంఘాలు మాత్రం సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సినిమా విడుదల ఆపేయాల్సిందిగా కోర్టును కూడా ఆశ్రయించాలని భావిస్తున్నారు. అయితే సెన్సార్ క్లీయరెన్స్ ఇచ్చిన తర్వాత కోర్టు కూడా ఏమీ అభ్యంతరం చెప్పదని, సినిమా విడుదలకు అడ్డుకోవడంలో కోర్టుకు అధికారం ఉండదని న్యాయనిపుణులు అంటున్నారు. దాంతో కొందరు బ్రహ్మణులు మాత్రం సినిమా విడుదలయ్యే వరకు ఆగి, అందులో అభ్యంతరాలు ఉంటే అప్పుడు పోరాడాలని నిర్ణయించుకున్నారు.
మరిన్ని వార్తలు