Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రం మూడు రోజల క్రితమే ప్రేక్షలకు మందుకు వచ్చింది. అప్పుడే సినిమాకు సంబంధించిన పైరసీ వచ్చేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ‘డీజే’ చిత్రం పైరసీ ప్రింట్‌ను భారీగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ విషయమై సైబర్ పోలీసులకు నిర్మాత దిల్‌రాజు ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా ఫేస్‌బుక్‌లో ‘డీజే’కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్‌ను అప్‌లోడ్ చేసిన ఒక యూజర్‌పై క్రిమినల్ కేసును నమోదు చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం టొరెంట్‌ను రూపంలో ఉన్న సినిమాను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘డీజే’ చిత్రంకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. ఇక సినిమా యావరేజ్ అంటూ రివ్యూలు వచ్చాయి. దీనికి తోడు ఇలా పైరసీ వెంటనే రావడంతో నిర్మాత దిల్‌రాజు ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి వెనక్కు రావడం కష్టమే అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక పైరసీ వచ్చిన నేపథ్యంలో వారు మరింతగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సినిమాలను పైరసీ బారిన పడకుండా కాపాడటంలో మాత్రం పోలీసులు విఫలం అవుతున్నారు. కోట్లలో నష్టాలు వస్తున్నా పైరసీ గురించి ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని వార్తలు