Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డీజే’ చిత్రం ఈనెల 23న విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సినిమా విడుదల అయ్యేది అనుమానమే అన్నట్లుగా ఉంది. ‘డీజే’ చిత్రాన్ని విడుదల కానివ్వబోం అంటూ బ్రహ్మణ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాటలోని బ్రహ్మణ వ్యతిరేక పదాలు తొలగిస్తామని హామీ ఇచ్చి, ఆడియో సీడీల్లో అవే పదాలను కొనసాగించడంతో పాటు, సినిమాలో పలు సన్నివేశాలు కూడా బ్రహ్మణ సమాజంను అవమానించినట్లుగా ఉన్నాయంటూ బ్రహ్మణ సంఘాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సెన్సార్ బోర్డు సభ్యులకు, పోలీస్ కమీషనర్‌కు, మంత్రికి ఫిర్యాదు చేసిన బ్రహ్మణ సంఘం నాయకులు తాజాగా హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ‘డీజే’ చిత్రంలో బ్రహ్మణులను అవమానిస్తు పలు సీన్స్ ఉన్నట్లుగా తమ దృష్టికి వచ్చినట్లుగా వారు ఫిర్యాదు చేశారు. దాంతో ప్రస్తుతం హెచ్ఆర్సీ సభ్యులు ‘డీజే’ చిత్ర యూనిట్ సభ్యులకు నోటీసులు పంపారు. సినిమాకు సంబంధించి బ్రహ్మణులు చేస్తున్న ఆరోపణు, అభ్యంతరాలను చిత్ర యూనిట్ సభ్యుల దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందించనుంది, విడుదల దగ్గర పడుతున్న సమయంలో ఈ వివాదాలు నిర్మాతకు తలనొప్పిని తెచ్చి పెడుతున్నాయి.