Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్ తాజాగా ‘డీజే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విడుదలైన మొదటి వారం రోజుల్లో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. రెండవ వారంలో కూడా పెద్దగా పోటీ లేక పోవడంతో మరో 40 కోట్ల వరకు వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంత భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. రివ్యూలు కూడా బ్యాడ్‌గా వచ్చాయి. అయినా కూడా ఇంత భారీ వసూళ్లు సాధించడం టాలీవుడ్ వర్గాల వారికి షాక్ ఇస్తుంది.
ఒక స్టార్ హీరో సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంటే 60 కోట్లు లేదా 70 కోట్లు వసూళ్లు చేయడమే ఇప్పటి వరకు అత్యధికం. కాని బ్యాడ్ రివ్యూలతో, మిశ్రమ స్పందన తెచ్చుకున్న ‘డీజే’ చిత్రం ఈస్థాయిలో వసూళ్లు సాధిస్తుండటంతో బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతుంది. టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, మహేష్‌బాబులు కూడా ఈ స్థాయిలో వసూళ్లు సాధించలేక పోయారు. బన్నీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్స్‌ను రాబట్టడం వేరు, ఇలా వసూళ్లను రాబట్టడం వేరు అంటూ మెగా అల్లు ఫ్యాన్స్ కొత్త అర్థంను చెబుతున్నారు. మా అల్లు అర్జున్ టాలీవుడ్ నెం.1 అంటూ తేల్చి పారేస్తున్నారు. డివైడ్ టాక్‌తోనే 150 కోట్లు రాబడుతున్నాడంటే, ‘డీజే’ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంటే ఈజీగా 200 కోట్లు వసూళ్లు చేసేవాడని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. ట్రేడ్ పండితులు కూడా ‘డీజే’ సాధించిన కలెక్షన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వార్తలు