Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. కాని షాకింగ్‌గా సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. జస్ట్ ఓకే అన్నట్లుగా టాక్‌ను సొంతం చేసుకుంది. నా పేరు సూర్య చిత్రం కలెక్షన్స్ బాగానే ఉన్నాయని భావిస్తున్న సమయంలో ‘మహానటి’ చిత్రం విడుదల కాగానే మొత్తం తారు మారు అయ్యింది. మొదటి నాలుగు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టిన సూర్య మహానటి వచ్చిన తర్వాత పూర్తిగా డ్రాప్ అయ్యింది. అయినా ఏమాత్రం ఈగోకు పోకుండా మహానటి చిత్ర యూనిట్ సభ్యులకు భారీ పార్టీ ఇచ్చేందుకు బన్నీ సిద్దం అయ్యాడు.
ఇటీవలే ‘మహానటి’ చిత్రం సాధించిన విజయంను పురష్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ సభ్యులను సన్మానించాడు. వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. అద్బుతమైన సినిమా తెరకెక్కించారు అంటూ దర్శకుడిపై చిరంజీవి అభినందనలు కురిపించాడు. ఇక తాజాగా చిరంజీవి మాదిరిగానే అల్లు అర్జున్ కూడా ‘మహానటి’ చిత్ర యూనిట్ సభ్యులను అభినందించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. చిరంజీవి కేవలం వారిని సన్మానిస్తే అల్లు అర్జున్ మాత్రం వారికి గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నాడు. మహానటి వంటి గొప్ప సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు మహానటి దర్శకుడిపై బన్నీ ప్రశంసలు కురిపించాడు. తన సినిమా కలెక్షన్స్ మహానటి వల్ల పూర్తిగా డ్రాప్ అయ్యాయి అనే కోపం లేకుండా బన్నీ వారికి ఏకంగా గ్రాండ్ పార్టీ ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏంటో అంటూ సినీ వర్గాల వారు ముక్కున వేలేసుకుంటున్నారు