కథ కాపీ వివాదం.. మార్పులు చేర్పులు

allu arjun naa peru surya movie copied from hollywood movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అల్లు అర్జున్‌ హీరోగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య’. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగబాబుతో కలిసి లగడపాటి శ్రీధర్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం కథ కాపీ అంటూ, ఒక ఇంగ్లీష్‌ సినిమాను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని కథను సిద్దం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ మద్య ‘అజ్ఞాతవాసి’ కథకు సంబంధించినట్లుగా ఈ కథ కూడా ఒక సినిమా కథ అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కిన ఒక ఇంగ్లీష్‌ సినిమాకు బన్నీ చేస్తోన్న సినిమాకు దగ్గర పోలికలున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ సినిమా ఛాయలు ఇందులో కనిపించకుండా ఉండేందుకు కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్ర కథకు ఆ సినిమా ఇన్సిపిరేషన్‌ అని, అయితే ఆ విషయాన్ని బయటకు చెబితే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో కాపీ కాదని, కొన్ని సీన్స్‌, స్టోరీ లైన్‌ కలిస్తే అది కాకతాలియమే అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. అందుకే సినిమాలోని పలు సీన్స్‌ను ఆ చిత్రానికి దూరంగా ఉండేలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెరకెక్కించిన కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ చేయడం, మరి కొన్ని సీన్స్‌లో మార్పులు చేయడం చేస్తున్నారంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.