Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరెవరు ఏ కాంపౌండ్ కి దగ్గర అనేది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే కుర్ర కారు ఈ గీతలు చెరిపేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూనే వున్నారు. మారుతున్న పరిస్థితులకు అద్దం పట్టే మేటర్ ఇది. ఎన్టీఆర్ హీరోగా ఓ 50 ఏళ్ల కిందట వచ్చిన లవకుశ సినిమాలో ‘ ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు’ అన్న పాట మోస్ట్ పాపులర్. పల్లెల్లో గ్రామ్ ఫోన్ లు మోగినంత కాలం ఈ పాట ప్రతి దేవాలయం, కమ్యూనిటీ హాల్స్ లోని మైకుల ద్వారా వినిపించేది. అయితే గడిచిన ఇరవై ఏళ్లలో ఆ పాట వినిపించడం తగ్గిపోయింది.
తాజాగా లవకుశ సినిమాలోని ఆ పాటను ఓ మెగా హీరో తన సినిమాకి టైటిల్ గా పెట్టుకున్నారు. ఆ హీరో అల్లు శిరీష్. కొత్తజంట హిట్ తర్వాత ఎంతో ఆచితూచి ఐ.వీ. ఆనంద్ దర్శకత్వంలో శిరీష్ చేస్తున్న చిత్రానికి ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అన్న టైటిల్ నిర్ణయించారు. ఈ దర్శకుడు ఇంతకు ముందు నిఖిల్ తో చేసిన సినిమాకి కూడా ఎక్కడికిపోతావు చిన్నవాడా అంటూ ఓ పాత హిట్ సాంగ్ చరణాన్ని టైటిల్ గా పెట్టాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో హిట్ సాంగ్ ని శిరీష్ సినిమాకి టైటిల్ గా నిర్ణయించాడు.