Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య వివాహం సమంతతో అక్టోబర్లో వైభవంగా జరుగబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పెళ్లి ఏర్పాట్లు చేసేందుకు చైతూ తల్లి అమెరికాలో ఉంటున్నారు. నాగార్జున రెండవ భార్య అమల పెళ్లి గురించి ఏమైనా పట్టించుకుంటారా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చైతూ, సమంతల వివాహంను అన్ని తానై పనులు చక్కబెడుతుంది అమలా. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తాను చైతూ వివాహ పనుల్లో బిజీగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.
పెళ్లి కోసం గత కొన్ని రోజులుగా షాపింగ్ చేస్తున్నామని, పెళ్లి తర్వాత రిసెప్షన్ కోసం కూడా తానే స్వయంగా ఏర్పాట్లు చేయిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. నాగచైతన్యను తన సొంత కొడుకుగా భావించి అమల పెళ్లి ఏర్పాట్లు చేయడంను అక్కినేని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. ఇప్పటికే సమంతను కోడలుగా దగ్గరకు తీసుకున్న అమలా, కొడుకు పెళ్లి కోసం ఎన్నో ప్లాన్స్ వేస్తున్నట్లుగా ఆమె మాటలను చూస్తుంటే అర్థం అవుతుంది. అక్కినేని ఫ్యామిలీలో చాలా కాలం తర్వాత జరుగబోతున్న పెద్ద వేడుక కనుక ఈ పెళ్లిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని వార్తలు: