తల్లిదండ్రులను కోల్పోవడమనేది అత్యంత బాధాకరమైన విషయం. ఆ బాధ వర్ణించలేనిది. జీవితంలో అదే పెద్ద మలుపు అవుతుంది. అలాంటి సంఘటనతో మనకెన్నెన్నో ఆలోచనలు వస్తాయి, జీవితమంతా చీకటిగా మారినట్టు కనిపిస్తుంది. క్యాన్సర్తో మా తండ్రి మరణించడం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ఘటనతోనే లైఫ్ అంటే ఏంటో అర్థమైంది.. అక్కడే జీవితమంటే ఏంటో తెలుసుకున్నాను.
మనమంతా ఓ అందమైన ప్రపంచంలో జీవిస్తున్నాము. ఇక్కడ మన ఆలోచనలను, మన కదలికలను అందరూ గమనిస్తుంటారు. బంధనాల మధ్య పెరుగుతుంటాము. నేను నా చిన్నప్పటి నుంచి అలాంటి పరిస్థితుల్లోనే పెరిగాను. మనలోపలి భావాలను దాచిపెట్టేసి అలా బతికేస్తుంటాము.
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని మనం ప్రేమించుకోవడమే మరిచిపోతాము. అసలు దాని గురించి పట్టించుకోము కూడా. మనలోపలి భావాల గురించి ఆలోచించే తీరిక కూడా ఉండదు.. వాటి బాధను కూడా పట్టించుకోము.
మనం బతకడం కోసం, ఓ తోడు కావాలని బంధాలను మార్చుకుంటూ వెళ్తుంటాము. మనల్ని మనమే కోల్పోతు.. మిగిలిన సగం కోసం ఇతరుల వెంట పడతాము. కెరీర్, మనుషులు, బంధాలు అంటూ పరిగెత్తుతూ.. మనల్ని మనం కోల్పోతున్నాము. ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా ప్రేమించడం ప్రారంభిస్తామో అప్పుడు భయం, వెలుతురు, చీకటి, సంతోషం, వంటివి ఏవీ ప్రభావితం చేయలేవు.
ఇక నుంచి పారిపోకూడదని అనుకుంటున్నా.. దైర్యంగా ముందుకు నడవాలని నేను నిశ్చయించుకున్నా. మహిళల జీవితంలో వారెప్పుడూ తమ గురించి ఆలోచించరు. మా కుటుంబాల్లో మహిళలెప్పుడూ తమ భర్త, పిల్లలు, వారి గురించే తప్ప తమ గురించి ఎప్పుడూ ఆలోచించరు. వారి గురించి వారు తెలుసుకునేలా, వారిని వారు ప్రేమించుకునేలా చేయడం మన బాధ్యత.
వారిని వారు పూర్తిగా కోల్పోకముందే.. వారి గురించి వారు తెలుసుకోవడం, వారి అంతరాత్మను దర్శించేలా చేయాలి. నేను మొత్తం కోల్పోయాను.. అలాగే మా అమ్మ కూడా డ్రిపెషన్లోకి వెళ్లిపోయింది. అయినా సరే మేము ఫినిక్స్ పక్షుల్లా ఎగరడానికి ప్రయత్నిస్తున్నాము.
ఎప్పుడూ నా వెన్నంటే ఉండి, నన్ను సపోర్ట్ చేసే మా సోదరుడికి ధన్యవాదాలు. చిన్నప్పటి నుంచి ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్నాడు. శోకతప్త హృదయాలతో ఉన్నవారు, గుండె పగిలిన వారందరికీ బాధలు మాయమవ్వాలి’ అంటూ అమలాపాల్ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది.