క్యాస్టింగ్ కౌచ్, ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీని పట్టి కుదిపేసిన సమస్య. అయితే ఈ సమస్య మీద సీనియర్ నటి ఆమని స్పందిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది తనకి తెలిసి లేదని తెలిపారు. అయితే, కొన్ని కొత్త కంపెనీల్లో మాత్రం కొందరికి అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. కొత్తవారికి చూసి బాగున్నావని చెప్పి, ఓక సినిమాలో తీసుకుంటామని అనే వారని, తదుపరి రోజు ఫోన్ చేసి గెస్ట్‌హౌస్‌కు రండని, ఒకసారి మేకప్ టెస్ట్ చేస్తామని అనేవారని చెప్పారు. గెస్ట్‌హౌస్ అనగానే ఆ విషయం అర్థమయిపోయేదని, ఇలాంటివన్నీ కొత్త కంపెనీలో ఉంటాయని ఆమని అన్నారు. సినిమాలు తీస్తారో తీయరో తెలియని కంపెనీలు చాలా ఉంటాయని, అలాంటి వాటిల్లో ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పారు. కానీ, ప్రొఫెషనల్ కంపెనీల్లో కనిపించవని పేర్కొన్నారు.