Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సమకాలీన ప్రపంచంలో అగ్ర దేశంగా ఎధుగుతున్న చైనాకు అఢ్డుకట్ట వేయడానికి అమెరికా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఎందుకంటే దక్షిణ చైనా సముద్రం విషయంలో డ్రాగన్ కంట్రీని కట్టడి చేస్తున్న అమెరికా.. ఇప్పుడు డోక్లాంలో కూడా తలదూర్చాలని భావిస్తోంది. యుద్ధం వస్తే భారత్ కు మద్దతివ్వాలని అమెరికన్ మీడియా ప్రభుత్వానికి సూచిస్తోంది.
ఇందుకోసమే కాచుక్కూర్చున్న చైనా.. ఇండో, చైనా యుద్ధాన్ని పాశ్చాత్య దేశాలు కోరుకుంటున్నాయని మండిపడుతోంది. 1962 యుద్ధం వెనుక కూడా రష్యా, అమెరికా ఉన్నాయని, ఇప్పుడు మరోసారి మూడో ప్రపంచ అగ్రదేశాల్ని కదనరంగంలోకి దూకించి.. ఆ యుద్ధపు మంటల్లో చలి కాచుకోవాలని అమెరికా భావిస్తోందని గ్లోబల్ టైమ్స్ ఘాటుగా కథనం రాసింది.
నిజానికి చైనా అమెరికాను ఫోకస్ చేస్తుంది కానీ.. మొత్తం ప్రపంచమంతా చైనాకు వ్యతిరేకంగానే ఉంది. అందుకే చైనా కూడా దూకుడుగా వెళ్లకుండా చాప కింద నీరులా వ్యవహరిస్తోంది. నిజంగా చైనా యుద్ధానికి దిగితే భారత్ కు మద్దతుగా అమెరికానే కాదు బ్రిటన్, జపాన్, సౌత్ కొరియా, థాయ్ లాండ్, మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాలు ముందుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మరిన్ని వార్తలు: