దాడులకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఐసిస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ మరణించాడు. మూడు సంవత్సరాలుగా అమెరికా సైన్యం కన్నుగప్పి తిరుగుతున్న ప్రపంచ వ్యాప్తంగా దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదిని అంతమొందించాయి.ఈ ప్లాన్‌కి గతంలో బాగ్దాదీ చేతిలో చిత్ర హింసలపాలై, హత్యకి గురైన అమెరికా దేశ మానవ హక్కుల కార్యకర్త కైరా ముల్లర్ పేరుని పెట్టారు.
వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్ తెలుపుతూ అమెరికా సైన్యం చేసిన రహస్య దాడి చేసి హత మార్చమని తెలిపారు. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ లోని బరీషా గ్రామంలో దాడులు జరిగాయి. దాడి ప్రాంతంలో విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అమెరికా సేన ఉగ్ర సంస్థ కార్యకలాపాలు ఐసిస్ అంతర్జాతీయ సంబంధాల వివరాలు డాక్యుమెంట్లలో ఉన్నాయని తెలుసుకున్నారు. చనిపోయిన గ్రామంలోనే బాగ్దాదీ ఉన్నట్టు రెండు వారాల క్రితం అమెరికా నిర్ధారించుకుని రష్యా, ఇరాక్, టర్కీ దేశాల అనుమతితో వాయవ్య సిరియాలోని స్థావరంపై దాడి చేశాయి.