బాబుని రమ్మంటే రానన్నాడు …మోడీ వస్తానంటే వద్దన్నాడు.

Amit Shah Calls CBN to Discuss Andhra Pradesh's Demands in Delhi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విభజన హామీల మీద కేంద్రంతో పోరాటానికి వెనకడుగు వేసే ఉద్దేశం టీడీపీ కి ఎంత మాత్రం లేదని చెప్పేందుకు ఈ మధ్య కాలంలో జరిగిన రెండు ఘటనలే పెద్ద ఉదాహరణ. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు ప్రత్యక్ష పోరాటానికి దిగాక ప్రధాని మోడీ కార్యాలయం నుంచి ఓ సందేశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం సహకారంతో జరుగుతున్న కార్యక్రమాల ఓపెనింగ్ లాంటిది ఏదైనా ఉంటే మోడీ రావాలి అనుకున్నట్టు ఆ సందేశం లో సారాంశం. సాక్షాత్తు ప్రధాని వస్తానంటే ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం లో వున్నా కాదని అనలేదు. కానీ బాబు సర్కార్ అలాంటి ఓపెనింగ్ లు లేవని చెప్పడం ద్వారా మోడీ ని ఏపీ కి రావద్దని నేరుగా చెప్పేసింది. అయినా బీజేపీ ఇంకా ఒంటెత్తు పోకడలతో ముందుకు వెళుతూనే వుంది.
మార్చి 5 నుంచి జరగబోయే రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ నిరసన గళం బలంగా వినిపించాలని పార్టీ ఎంపీలకు బాబు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని పార్టీలకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి చేసిన మోసాన్ని వివరిస్తూ ఓ లేఖ రాయాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో కమలనాధులు షాక్ తిన్నారు. అదే జరిగితే ఏ ప్రాంతీయ పార్టీ కూడా బీజేపీ తో ఎన్నికల పొత్తుకు ఆసక్తి చూపదని తెలుసు. ఆ పని జరిగితే 2019 ఎన్నికల కన్నా ముందే బీజేపీ ఓటమి ఖరారు అవుతుంది. ఈ పరిస్థితిని కాస్త ఆలస్యంగా గ్రహించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కిందకు దిగారు. నిన్నగాక మొన్న వెంకయ్య సమక్షంలో జరిగిన చర్చల్లో టీడీపీ ప్రతినిధులతో ఎకసెక్కంగా మాట్లాడిన షా ఇప్పుడు చంద్రబాబుకి ఫోన్ చేసి ఢిల్లీ రావాలని కోరారు. ఇంకో ముఖ్యమంత్రి అయితే ఏమో గానీ చంద్రబాబు ఆ ఉచ్చులో పడలేదు. ఢిల్లీ వెళ్లి ఏమీ సాధించకుండా వస్తే ఏమి జరుగుతుందో బాబుకు తెలుసు. పైగా బీజేపీని నమ్మితే ఏమి జరుగుతుందో ఇప్పటికే ఎన్నో సార్లు చూసిన అనుభవం కూడా వుంది.అందుకే ఏ మొహమాటం లేకుండా మొన్న మా వాళ్ళతో అలా మాట్లాడారు ఏంటని షా ని నిలదీసి మరీ , మరో ప్రతినిధి బృందాన్ని పంపిస్తాను తప్ప తాను రాలేనని కుండా బద్దలు కొట్టారు. దీంతో బాబు ముందు బీజేపీ చేస్తున్న చీప్ ట్రిక్స్ పనికి రాకుండా పోతున్నాయి.