Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విపక్ష పార్టీల మీద బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. విపక్షాలను కుక్కలు, పిల్లులు, పాములతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈరోజు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబైలో ఓ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి కుక్కలు, పిల్లులు, బాతులు, ముంగిసలన్నీ ఏకమయ్యాయని ఎద్దేవా చేశారు.
2019 ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని, విపక్షాలన్నీ ఏకమైనా బీజేపీని ఏమీ చేయలేవన్నారు. విపక్షాలన్నీ కుక్కలు, పిల్లులు, ముంగిసలు, పాముల్లాంటివని… ఓ పెద్ద ఉప్పెన వస్తే అవన్నీ చెట్టేక్కేస్తాయంటూ ఎద్దేవా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి ఉప్పెనలా విజృంభిస్తే… విపక్షాలు వరద నీటిని చూసి భయపడి చెట్టేక్కే రకాలని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలను ప్రధాని నరేంద్ర మోదీ చాలా సవ్యంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నా, విపక్షాలు మాత్రం సభ సమయాన్ని వృథా చేశాయని ఆరోపించారు.