Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Nda నుంచి తప్పుకుని కేంద్ర సర్కార్ మీద అవిశ్వాస తీర్మానం ఇచ్చిన టీడీపీ మీద బీజేపీ ఎదురు దాడి మొదలైంది. తాము nda నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కి చంద్రబాబు ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖకు బదులు అన్నట్టు అమిత్ షా కూడా చంద్రబాబుకి తొమ్మిది పేజీల లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ కి , టీడీపీ కి బీజేపీ ని మించిన మిత్రులు లేరట. పైగా ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఇచ్చిన అన్ని హామీలను బీజేపీ సర్కార్ తూచా తప్పకుండా అమలు చేసిందట. విభజన చట్టం అమలు చేయడానికి పదేళ్లు టైం ఉన్నప్పటికీ ముందుగానే అన్నీ చేసేస్తున్నామని అమిత్ షా ఆ లేఖలో వివరించారు.
రాజధాని సహా వివిధ అభివృద్ధి పథకాలకు ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టకుండా ఇంకా అదనపు నిధుల కోసం అడగడం భావ్యం కాదని అమిత్ షా ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. టీం ఇండియా స్పిరిట్ తో పనిచేస్తున్న ప్రధాని మోడీకి వేరే ఉద్దేశాలు అంటగట్టడం తగదని షా అన్నారు.టీడీపీ నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని , పైగా అది ఏకపక్షంగా రాజకీయాల కోసమే తీసుకున్నారని షా ఆరోపించారు. అభివృద్ధి , రాజకీయాలకు ముడిపెట్టడం తగదని హితవు పలికిన అమిత్ షా లేఖ పూర్తి ప్రతి మీ కోసం.