బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన ఉదారతను చాటుకున్నారు. రెండు వేల మందికి పైగా రైతులు వ్యవసాయం కోసం చేసిన అప్పులను తీర్చి వారి పాలిట దైవంగా మారాడు. ఈ రైతులంతా బిహార్‌కు చెందినవారు కాగా అలా అప్పు తీసుకున్న రైతుల్లో తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న 2100 మంది రైతులను ఎన్నుకున్న అమితాబ్ వారి అప్పులని బ్యాంకులకు వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా క్లియర్ చేశారు. కూతురు స్వేతా, కొడుకు అబిషేక్ ల చేతుల మీదుగా బాధిత రైతులకు అమితాబ్ సాయం చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు అమితాబ్ అమలు పరిచారు. రైతుల రుణాలను చెల్లించడం అమితాబ్‌కు ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వెయ్యి మంది రైతుల రుణాలను చెల్లించారు. ఆయన చేసిన మరో వాగ్దానం నెరవేర్చాల్సి ఉంది. దేశం కోసం పుల్వామా దాడిలో మృతిచెందిన అమరవీరుల కుటుంబ సభ్యులను, వారి భార్యలను ఆదుకోవాల్సి ఉందనే విషయాన్ని తన బ్లాగ్ లో రాసుకున్నారు.