భావోద్వేగానికి గురైన చిరు..

tollywood actor chiranjivi
chiranjivi

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయిరాజేశ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బేబీ. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన బేబీ చిత్రబృందం హైదరాబాద్ లో విజయోత్సవ వేడుక జరుపుకుంది.

బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చిరంజీవి గురించి మాట్లాడుతూ ‘మా జీవితంలో మిమ్మల్ని చుస్తునని అనుకోలేదు , అలంటి మీరు, మేము చేసిన సినిమా ఈవెంట్ కి రావడం అసలు నమ్మలేకపోతున్నా , మిమ్మల్ని ఆలా చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు . మీరు ఈ ఫంక్షన్ కి రావడం చాల ఆనందంగా ఉందని, బేబీ ఇంత పెద్ద విజయం సాధించడానికి మా డైరెక్టర్ సాయి రాజేష్ గారికి, నిర్మాత ఎస్కేఎన్ గారికి , నాతో పాటు పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు . ఈ సినీ పరిశ్రమ ఎంతో మంచి ప్లాట్ ఫారం. అంటే మనం ఎంత కష్ట పడ్డ దానికి వాల్యూ వస్తుంటే ,మనం పెర్ఫర్మ్ కి result వస్తుంటే , జనాలు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తుంటే , ప్రేమ చూపిస్తుంటే హార్ట్ నిండిపోతుంది . చెప్తున్నా కదా తెలుగు అమ్మాయిలు వచ్చేయండమ్మా , నాకైతే రాజేష్ గారు , ఎస్కేఎన్ గారు ఎంతగా లైఫ్ ఇచ్చారో అలాగే ప్రతి ఒక్కరికి లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఉంటాది . అది నాకు బేబీ సినిమా తో వచ్చింది.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ” మేమైతే పెద్ద స్టార్స్ కాదని మమ్మల్ని స్టార్స్ గా మార్చింది బేబీ సినిమా . బేబీ ఇంతగా ఘన సాధించడంతో మాకు ఈ స్టార్ డం వచ్చిందని . నిన్న రిలీజ్ అయినా బేబీ హిట్ . నేడు రిలీజ్ అయినా బ్రో హిట్ , రేపు అంటే ఆగష్టు 11 th భోళా రిలీజ్ అవుతుందని చెప్పాడు . ఈ మూడు సినిమాలలో కామన్ ఉన్నది స్టార్టింగ్ ;లెటర్ బి . అని తెలిపారు . ఈ మెగా ఈవెంట్ కి మెగా స్టార్ చిరంజీవిగారు రావడం చాల ఆనందంగా ఉందని కొనియాడారు .

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ, ఈ వాతావరణం చూస్తుంటే బేబీ విజయోత్సవ సభకు వచ్చినట్టుగా లేదని, తన సన్మాన సభకు వచ్చినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం తన జీవితంలో అనేక మధుర ఘట్టాలు చోటుచేసుకున్నాయని, ఓ వైపు పుత్రోత్సాహం, మరోవైపు తోబుట్టువుల అభివృద్ధి, ఇంకోవైపు మేనల్లుళ్ల ఎదుగుదల, మిత్రులు అభివృద్ది చెందడం చూస్తుంటే ఆ ఆనందం వర్ణనాతీతం అని పేర్కొన్నారు.

అభిమానులు నాకు దేవుడు ఇచ్చిన తమ్ముళ్లు అనుకుంటాను… వీళ్లలో అనేకమంది నన్ను ప్రేరణగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చి విజయాలు సాధిస్తూ తమకంటూ ఓ స్థానం ఏర్పరచుకుంటున్నారని వివరించారు. బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయిరాజేశ్ ఇలాంటివాళ్లేనని, వాళ్లు తనకు ఎప్పటి నుంచో తెలుసని చిరంజీవి అన్నారు.
అభిమానుల ప్రయత్నం ఇంత విజయవంతం అయినందుకు అభినందించాలనే ఈ కార్యక్రమానికి వచ్చానని చిరంజీవి తెలిపారు. అభిమానులు ఓ మెట్టు ఎదిగితే తనకంటే సంతోషించేవారు ఇంకెవరూ ఉండరని చిరంజీవి భావోద్వేగభరితంగా చెప్పారు.