తన పేరు చెప్పలేకపోతున్నారంటూ అనసూయ ట్వీట్..?

Anasuya Bhardwaj
Anasuya Bhardwaj

మనసులో ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా చెప్పేసే సెలబ్రిటీల్లో ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్..కూడా ఒకరు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఆమె చేసే ప్రతి ట్వీట్ ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది . ప్రస్తుతం అనసూయ చేసిన మరో కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది . ‘‘మళ్లీ ఏమైంది మేడమ్ ? మిమ్మల్ని ఎవరేమన్నారు?’’ అంటూ అభిమానులు కంగారు పడిపోతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇంతకీ అనసూయ ఏమన్నారంటే.. ‘‘వావ్.. నేను నిజంగా చాలా ముఖ్యమైన వ్యక్తినే. నా ప్రమేయం ఉన్నా లేకున్నా.. నాకు సంబంధం ఉన్నా లేకున్నా.. నా పేరు ఎత్తకుండా ఒక్క చర్చ కూడా జరగదంటే.. నాపై అంతగా ఆధారపడి ఉన్నారు. నా ప్రస్తావన లేకుండా ఏదీ చెప్పలేకపోతున్నారు’’ అని అనసూయ ఓ ట్వీట్ వదిలారు. దీంతో, ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పరోక్ష వ్యాఖ్యలు చేసిందో అర్థంకాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. అనసూయ గతంలో చేసిన చాలా సార్లు ట్వీట్ లు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.