Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జబర్దస్త్ కామెడీ షోతో ఒక్కసారిగా ఫేమస్ అయిన హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లి తెరపై ఏ స్థాయిలో అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లెక్కకు మించి షోలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్న అనసూయ అప్పుడప్పుడు వెండి తెరపై కూడా మెరుస్తోంది. ప్రస్తుతం చరణ్ మూవీ రంగస్థలం చిత్రంలో ఒక కీలక పాత్రను అనసూయ పోషిస్తున్న విషయం తెల్సిందే. ఐటెం సాంగ్స్‌కు, హీరోయిన్ పాత్రలకు కూడా అనసూయను పలువురు నిర్మాతలు సంప్రదిస్తున్నారు. అయితే ఆచి తూచి అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ముద్దుగుమ్మ అనసూయ తాజాగా తన భర్తను కూడా ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.
అనసూయ భర్త ఒక బ్యాంక్ ఎంప్లాయి. బుల్లి తెర మరియు వెండి తెరపై అనసూయ చాలా బిజీ అవ్వడంతో ఆయన బ్యాంక్ జాబ్‌ను మానేశాడు. ప్రస్తుతం అనసూయ డేట్లు చూడటంతో పాటు, వ్యాపారాన్ని కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే ఆయనకు నటించాలనే కోరిక కలిగిందట. చూడ్డానికి బాగానే ఉండి, నటనపై ఆసక్తి ఉండటంతో అనసూయ కూడా తన భర్తను వెండి తెరపై చూడాలని ఆశపడుతుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గత మూడు నాలుగు నెలలుగా అనసూయ భర్త హైదరాబాద్‌లోని ఒక యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్నాడు. తనకున్న పరిచయాలతో మీడియం బడ్జెట్ మూవీల్లో అనసూయ అవకాశాలు ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనసూయ భర్త పరిచయం అవ్వాలని చూస్తున్నాడు. ఆ తర్వాత విలన్‌గా కూడా తన సత్తా చాటుతాను అంటున్నాడట. మరి అనసూయ సాయంతో రాబోతున్న అతడు సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి.