Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులకు దొరికిపోయిన యాంకర్ ప్రదీప్ ఆ తర్వాత కౌన్సిలింగ్ సెషన్ కి డుమ్మా కొట్టడంతో ఆయన పరారీలో వున్నాడని వార్తలు వచ్చాయి. ఇక దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. వాటికి బ్రేక్ వేసే ఉద్దేశంతో ప్రదీప్ అదే సోషల్ మీడియా ద్వారా తాను ఏ పరిస్థితిలో వున్నదీ వివరించాడు. తాను చేసిన తప్పు ఇంకెవరూ చేయొద్దని కూడా సోషల్ మీడియా వేదికగా విన్నవించుకున్నాడు. ఇంతకీ ప్రదీప్ ఏమన్నాడో మీరే చూడండి. ..