పవన్ కళ్యాణ్ తొలి టైటిల్‌తో యాంకర్ ప్రదీప్ కొత్త సినిమా!

Anchor Pradeep's new movie with Pawan Kalyan's first title!
Anchor Pradeep's new movie with Pawan Kalyan's first title!

బుల్లితెర యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రదీప్ మాచిరాజు వెండితెరపై హీరోగా కూడా నటించారు . ఆయన నటించిన తొలి మూవీ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ టాక్ ని తెచ్చుకుంది. ఇక ఇప్పుడు కొంత గ్యాప్ తరువాత ప్రదీప్ తన రెండో మూవీ ని అనౌన్స్ చేశాడు.

Anchor Pradeep's new movie with Pawan Kalyan's first title!
Anchor Pradeep’s new movie with Pawan Kalyan’s first title!

నితిన్-భరత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక ఫ్యామిలీ లవ్ ఎంటర్‌టైనర్ సినిమా లో ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్నారు . ఈ మూవీ లో మరో బుల్లితెర యాంకర్ దీపిక పిల్లి హీరోయిన్‌గా నటిస్తుంది . దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ కు ‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’’ అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ టైటిల్‌ని గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి మూవీ కి వినియోగించారు . ఇప్పుడు పవన్ టైటిల్‌తో ప్రదీప్ మాచిరాజు మూవీ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశారు.

ఇక ఈ మూవీ కు రధన్ సంగీతం అందిస్తుండగా మాంక్స్ అండ్ మంకీస్ పిక్చర్స్ బ్యాన్ ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.