ఇటీవల కాలంలో వరుస ప్రెస్మీట్లలో పాల్గొంటూ ఏదొక ప్రకటనలు చేస్తూ వార్తలో నిలుస్తున్న ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఎల్ పాల్ మీద ఆయన ఒక టికెట్ ఇస్తానని ప్రకటించిన యూ ట్యూబ్ యాంకర్ శ్వేతారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాశాంతి పార్టీ తరపును శ్వేతారెడ్డిని హిందూపురం అభ్యర్థిగా పాల్ కొద్దిరోజులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ హీరో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో శ్వేతారెడ్డి పోటీకి సై అనగానే ఏపీ రాజకీయ వర్గాల్లో కాస్త చర్చలకు తావిచ్చిన మాట వాస్తవమే. అయితే రెండు వారాలు గడవకముందే కేఏ పాల్ తీరుతో విసిగిపోయిన శ్వేతారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన్ని ఏకి పారేసింది. రాజకీయాల మీద ఎలాంటి అవగాహన లేని కేఏ పాల్ ఏపీ రాజకీయాలను మార్చేస్తానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతుంటే ఓ రాజకీయ పార్టీకి అధినేత అని చెప్పుకుంటున్న పాల్ రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించింది.
ఈ నెల 21 నాటికి పదివేల మంది పార్టీ సభ్యత్వాలను పూర్తి చేయాలని కేఏ పాల్ నాకు టార్గెట్ పెట్టారని అందుకు ఇంకా పదిరోజుల సమయం ఉందని ఇంతలోనే పాల్ శ్వేతారెడ్డి ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియదని అనడం తనని బాధించిందని తన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం పాపమని విగ్రహారాధన చేస్తున్న వారికి ఓట్లేయొద్దని చెప్పడానికి పాల్ ఎవరని ఆమె ప్రశ్నించారు. కేఏ పాల్ తో పనిచేయొద్దని ఎంతోమంది హెచ్చరించినా పట్టించుకోలేదని ఆయన మంచివాడని నమ్మి పార్టీలో చేరి కష్టపడుతున్నానని, ఆయన కోసం పనిచేస్తున్న తాను ఇప్పుడు కామెడీ పీస్‌లా తయారయ్యానని, పాల్ మాటలకు చేసే పనులకు పొంతనే ఉండదు. ఆయన ‘బైపోరాల్ డిజార్డర్’ అనే వ్యాధితో బాధపడుతున్నార’ని శ్వేతారెడ్డి విమర్శించారు.