Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సోషల్ మీడియాలో లోకేష్ ఇమేజ్ ని దెబ్బ తీయడమే పనిగా పెట్టుకున్న వైసీపీ కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అంటూ టీడీపీ శ్రేణులు ఎదురు దాడికి దిగడంతో సాక్షికి దిమ్మ తిరిగింది. అయ్యో ఆ కధనం మాది కాదంటూ సాక్షి వెబ్ సైట్ పాఠకులకి విన్నపం చేసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ మేటర్ ఏమిటంటే…
బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించగానే ఆ క్రెడిట్ ని లోకేష్ ఓన్ చేసుకున్నట్టు వైసీపీ సోషల్ మీడియా సేన ఓ సిగ్గులేనిపనికి పూనుకుంది.
‘ వెంకయ్యనాయుడు గారు రాష్ట్రానికి చేసిన సేవలకు గాను ఆయనకి ఏదైనా చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకునేవారు. మొన్న ఇదే విషయం ఆలోచిస్తుండగా ఉప రాష్ట్రపతి గురించి ఆలోచన వచ్చింది. వెంటనే నేను నాన్నతో చెప్పడం, ఆయన మోడీతో మాట్లాడడం, మోడీ ఒప్పుకోవడం వెంటనే జరిగిపోయింది’ అని లోకేష్ అన్నట్టు ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ లో వచ్చినట్టు ప్రచారం మొదలెట్టారు. ఇందుకోసం విలువలకి పాతరేసి మరీ ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ ని పోలిన డిజైన్ తో ఓ పేజీ క్రియేట్ చేసి అందులో పైన చెప్పిన లోకేష్ మేటర్ అందులో పోస్ట్ చేశారు. దీని కోసం నకిలీ ఆంధ్ర జ్యోతి వెబ్ సైట్ తయారు చేశారు.
ఇది జరిగిన కొన్ని గంటల్లో అదే మేటర్ లో లోకేష్ పేరు వున్న చోట జగన్ వచ్చి చేరాడు. ఇక ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ స్థానంలో సాక్షి వెబ్ సైట్ చేరింది. వెంకయ్య గురించి మోడీకి చెప్పి ఊపిరాష్ట్రపతిని చేసింది జగన్ అన్నట్టు నకిలీ సాక్షి వెబ్ సైట్ పేజీ లో కధనం వచ్చింది. పక్కన వారి మీద బురద చల్లడానికి అలవాటు పడిన వారికి సాక్షి పేరిట ప్రచారం అవుతున్న కధనం చూసేసరికి కంగారు పుట్టింది. వెంటనే ఇది సాక్షి కధనం కాదంటూ అసలు వెబ్ సైట్ ద్వారా పాఠకులకి విన్నపం చేసుకున్నారు. ఏదేమైనా వెంకయ్య ని ఉప రాష్ట్రపతి చేసిన ఘనత ప్రత్యర్థులకు దక్కేలా చేయడం కోసం నకిలీ ఆంధ్రజ్యోతి, నకిలీ సాక్షి వెబ్ సైట్స్ కూడా యుద్ధానికి తలపడ్డాయి.
మరిన్ని వార్తలు