బాబు ‘నారాయణ’ మంత్రం జపిస్తే…పవన్ కు షాక్…!

AP CM Chandrababu Naidu Gives Warning to BJP Leaders

ఆంధ్రప్రదేశ్‌లో మూడు నెలల్లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్ట్‌1 తో పంచాయతీలు పదవీకాలం ముగిసినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ మాజీ సర్పంచ్‌లు హైకోర్టును ఆశ్రయించగా, దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం పై తీర్పు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో 12,888 గ్రామ పంచాయతీలకు 1,30,870 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గత ఏడాది నవంబరు నుంచీ సన్నాహాలు చేసింది. ఏపీలో వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. సాధారణ ఎన్నికలకు ముందు ఏపీలో అధికార టీడీపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అంత సుముఖంగా లేదు. పంచాయతీ ఎన్నికల ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయని విశ్లేషకులు అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రిస్క్ ఎందుకనుకున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో పరిస్థితిని బేరీజు వేసేందుకు తనకు అత్యంత నమ్మకస్తుడు అయిన మంత్రి నారాయణకు బాధ్యత అప్పచెప్పినట్టు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా మంత్రి నారాయణ తన సొంత టీంలతో సర్వేలు చేయించి ఇప్పుడు పంచాయతీల ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయని సర్వేలు చేయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ap-elections

అయితే ఈ సర్వేల ద్వారా కొన్ని ఆసక్తికర అంశాలు బయట పడ్డాయట. ఈ సర్వేల ప్రకారం ఈ ఎన్నికలలో టీడీపీ పోటీ చేస్తే తిరుగుండదని సర్వేల ద్వారా తేలిందట. అయితే నెల్లూరు జిల్లా మీద స్పెషల్ గా సర్వే చేయించిన నారాయణ నెల్లూరు జిల్లాలోని రూరల్ ఏరియాల కంటే టవున్, సిటీలలో తెలుగుదేశానికి బలం పెరిగిందని తేల్చారు. ఈ నేపధ్యంలో త‌న‌కు నెల్లూరు సిటీ అయితే బాగుంటుంద‌ని భావించి ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు వ‌ద్ద పెట్ట‌డం, ఆయ‌న దీనికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం, అన‌ధికారికంగా నెల్లూరు సిటీ టికెట్‌ను మంత్రి నారాయ‌ణ‌కు క‌న్ఫ‌ర్మ్ చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. రాజకీయాలకి కొత్త అయినా రాజధాని వ్యవహారాల సహా అన్నింటిలోనూ ఆయనకు ప్రమేయాన్ని కల్పించారు చంద్రబాబు. విద్యా సంస్థల అధిపతిగా ఉండిన నారాయణకు చంద్రబాబుకి ఉన్న అనుబంధం ముందుగా ఆయనకు మంత్రి పదవి, ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి వరించేలా చేసింది. అయితే తాను ఉన్న రంగంలో నంబర్ వన్ గా నిలిచే నైజం నారాయణ సొంతం. దీంతో ఈ నాలుగున్నర ఏళ్లుగా మంత్రిగా సంపాదించిన అనుభవంతో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా నిరూపించుకోవాలని నారాయణ భావిస్తున్నారు.

elections

ఈ నేప‌థ్యంలో నారాయ‌ణ కూడా నెల్లూరు సిటీపై ప్ర‌త్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. దీనికి సామాజికవర్గం కూడా కలసివస్తుందని నారాయణ ఆలోచన. తన కులానికి చెందిన బలిజలు ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్నారు. అలాగే ఆర్ధికంగా కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు కనుక ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు నారాయణ ఉత్సహంగా ఉన్నారు. అయితే ఇదే నియోజకవర్గం నుండి నారాయణతో పాటుగా ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ మీద పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌ కృష్ణారెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనువాసులు రెడ్డి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయిన తాళ్లపాక రమేష్‌ రెడ్డి పోటీ పడుతున్నారు. వీరిలో శ్రీధర్‌ కృష్ణారెడ్డి తొలి నుంచీ టీడీపీనే నమ్ముకుని ఉన్నారు. అయితే గత ఎన్నికలలో వైసీపీ మేయర్ గా అజీజ్ ఎన్నికయ్యారు.ఏవో కొన్ని కారణాల వాళ్ళ ఆయన టీడీపీ పార్టీ లోకి ఫిరాయించాడు. ఆయన కూడా ఈ సారి టికెట్ కోసం పోటీ పడవచ్చు అయినా చంద్రబాబు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి నారాయణ మరింత దూకుడు పెంచారని సమాచారం.

andhra-pradesh

అవసరమైతే అజీజ్‌కు నెల్లూరు రూరల్ సీటు ఇవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. వైసీపీలో ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ మళ్లీ పోటీ చేయడం అనేది ఖాయమని భావిస్తున్నారు. అనిల్ కుమార్ మీద అయితే నారాయణ గెలుపు నల్లేరు మీద నడకే అని ఎటూ సర్వేలు తేల్చాయి. ఇక పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే పార్టీ గుర్తులతో సంబంధం లేని ఎన్నికలివి. పార్టీ గుర్తులతో సంబంధం లేని ఎన్నికలు కాబట్టి గెలుపోటములు పార్టీలపై అనుకున్నంత ప్రభావం చూపించకపోవచ్చు. ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలతో టీడీపీ బలం నిరోపించుకోవడంతో పాటు నేనే గెలిపించాను అని చెప్పుకునే పవన్ కల్యాణ్ వంటి నేతలకు తమ సత్తా ఏంటో తెలుసుకోవడానికి ఇదో సర్వేలా పనిచేస్తుంది. అందుకే మరి బాబు నారాయణ సర్వే మంత్రం జపిస్తే పవన్ కు షాక్ తప్పదు.

elections