14 మంది ఐపీఎస్ ల బదిలీ…అందుకేనా…!

Andhra Pradesh Govt Transfer 14 IPS Officers

తెలంగాణ పంచాయతీ ఎన్నికలను మూడు నెలల్లో నిర్వహించాలని చెప్పి ఆ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన హైకోర్టు ఏపీ విషయంలోనూ అదే తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలోని పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 90ను ఈ రోజు హైకోర్టు కొట్టివేసింది. మూడు నెలల్లోగా అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. పంచాయతీల కాలపరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించేలా ప్రభుత్వం జీవో 90ని తీసుకొచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవో 90ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ips

వచ్చే 3 నెలల్లోగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఎన్నికల ప్రక్రియను ప్రత్యేకాధికారుల ద్వారా పూర్తి చేయాలని సూచించింది. అయితే ఈ తీర్పు వెలువడిన కొద్ది సేపటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. కడప ఎస్పీ బాబూజీ అట్టాడకు విశాఖ రూరల్ ఎస్పీగా, చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబుకు గుంటూరు రూరల్‌ ఎస్పీగా, విశాఖ రూరల్ అడిషినల్ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగికి నెల్లూరు ఎస్పీగా, విశాఖ లా అండ్ ఆర్డర్‌ డిసిపి ఫకీరప్పకు కర్నూల్ ఎస్పీగా, తిరుపతి అర్బన్‌ ఎస్పీ అభిషేక్ మహంతికి కడపకు, పార్వతీపురం ఓఎస్డీ విక్రాంతి పాటిల్‌కు చిత్తూరుకు, చిత్తూరు ఓఎస్డీ అన్బురాజన్‌కు తిరుపతి అర్బన్‌ ఎస్పీగా, విశాఖ రూరల్‌ ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మకు విశాఖ సిట్‌కు, గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు విజయవాడ లా అండ్‌ ఆర్డర్‌ కు బదిలీ, నెల్లూరు ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణకు సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు, కడప అడిషనల్‌ ఎస్పీ అద్మాన్‌ నయీం అస్మీకు విశాఖ‌ లా అండ్‌ ఆర్డర్‌కు బదిలీ అయ్యారు. కర్నూల్ ఎస్పీ గోపినాథ్‌ జెట్టికి టిటిడి సెక్యూరిటీ, విజిలెన్స్‌ బాధ్యతలు, నర్సీపట్నం ఓఎస్డీ సిద్ధార్ధ కౌశల్‌కు గుంతకల్‌ రైల్వే ఎస్పీగా బాధ్యతలు, వెయిటింగ్‌లో ఉన్న రవీంద్రనాధ్‌ బాబుకు విశాఖ లా అండ్ ఆర్డర్‌ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ బదిలీలు సాధరణంగా జరిగినవేనా లేక ఈ ఎన్నికల దృష్టా జరిగినవా అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

transfer