పవన్….బిర్యానీ పార్శిల్, లక్ష అంతా బ్రాంతియేనా…!

Janasena-Chief-Pawan-Kalyan
శ్రీకాకుళం జిల్లాలో టిట్లీ తుపాను బాధితుల్ని తక్షణం ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం తక్షణం ప్రత్యేక బృందాలను పంపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలిసి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతి పత్రం అందించారు. మూడు రోజుల పాటు టిట్లి తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా తన పరిశీలనలకు వచ్చిన అంశాలను పవన్ తన వినతి పత్రంలో వివరించారు. ఉద్దానం ప్రాంతం మొత్తం సర్వం కోల్పోయిందని దీన్ని జాతీయ విపత్తగా ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. వీలైనంత త్వరగా కేంద్ర బృందాలు వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఇలాంటి సమయంలో కేంద్రం ఆదుకోవడం చాలా అత్యవసరమని గవర్నర్ కు అందచేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు.
title
అయితే గవర్నర్  తమ వినతి పత్రాన్ని కేంద్రానికి చేరవేస్తే కేంద్రం స్పందిస్తుందన్న భావనలో పవన్ కల్యాణ్ ఉన్నారట. ఒక వేళ కేంద్రం నుంచి స్పందన లేకపోతే స్వయంగా తానే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి భేటీ అవడానికి ప్రయత్నిస్తానని ఆయన చెబుతున్నట్టు తెలుస్తోంది. తమ విజ్ఞప్తులను గవర్నర్ సానుకూలంగా విన్నారన్నారు. తుపాను దెబ్బకు ఉద్దానం ప్రజలు సర్వం కోల్పోయారని ఏపీ ప్రభుత్వం ఇస్తామంటున్న నష్టపరిహారం వారికి ఇంకా అందలేదని పైగా వారు ఇస్తున్న మొత్తం ఎంత మాత్రం ప్రజలకు సరిపోదన్నారు. ఉద్దానంలో పరిస్థితుల్ని మీడియా కూడా సరిగ్గా చూపించడం లేదని అందువల్లే అక్కడి ప్రజలు బాధలు బయట ప్రపంచానికి తెలియడం లేదని శ్రీ పవన్ కళ్యాణ్ సెలవిచ్చారు.
janasena-chief-pawan
అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఇదివరకటిలా మీడియా మీద వ్యాఖ్యలు చేస్తే సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు వారి జనసేన అమ్ములపొదిలో 99టీవీ, ఆంధ్రప్రభ లాంటి మీడియా సంస్థలు చేరాయి కదా. అయితే వాటికీ వీటికీ ఏమిటి సంబంధం అందుకోవచ్చు, కచ్చితంగా ఉంది. ఎందుకంటే తిత్లీ తుఫాను వచ్చి శ్రీకాకుళాన్ని చిగురుటాకులా వణికిస్తే ఈయన ఎంచక్కా కారులో కవాతు చేసుకున్నారు. అదేమిటయ్యా అని మీడియా ప్రశ్నిస్తే కారణం ఏమి చెప్పారో తెలుసా సెక్యూరిటీ సమస్యలు అంట. ఉద్దానంకి ఎవరున్నా లేకున్నా పవన్ కళ్యాణ్ మాత్రం ఉన్నాడని జనసేనాని చాలా హైపిచ్ లో గతంలో శ్రీకాకుళం పోరాటయాత్రలో ప్రకటించారు. అయితే టిట్లి తుపాను వచ్చిన వెంటనే రాలేక ఈ భద్రతా సమస్య కారణంగా ఉద్దానం సూర్యుడు వారం రోజల తర్వాత ఉదయించాడు.
title-pawan
ఎక్కడైతే తాను ఉద్దానం కోసం ఉదయించిన ఉద్యమ సూర్యుడిగా చెప్పుకున్నాడో అక్కడి ప్రజలకు దర్శనం ఇచ్చారు. వారి బాధలు చూసి కన్నీళ్లు తెచ్చుకున్నంత పని చేశారు. నిజానికి కన్నీళ్లొచ్చాయి, కానీ బయటకు రాకుండా మింగేశారు. ఇంత వరకూ భావోద్వేగపూరితమైన ఘట్టం. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పాయింట్లను ఒక పుస్తకంలో నోట్ చేసుకుంటూ ఉంటారు మేధావిలాగా(బహుశా ఇలా చేయమని డబ్బులిచ్చి పెట్టుకున్న చింతల్ బస్తీ వాసుదేవ్ లాంటి సలహా దారులు సలహా ఇచ్చారేమో). అలాగే ఇక్కడ కూడా బాధితుల్ని అడిగి వివరాలు తెలుసుకుని , ఒక పుస్తకం లో రాసుకున్నారు పవన్ కళ్యాణ్.
ఇలా రాసుకోవడం చాలా సార్లు చూశాం ఆ మధ్య మహాప్రస్థానం పుస్తకం చదువుతూ అందులో పాయింట్లను తిరిగి రాసుకోవడం సిక్కోలులో చేసిన దీక్షలోనే అదీ ఉద్దానం కోసమే చేసిన దీక్షలో చూశాం అచ్చంగా అలానే శ్రీకాకుళంలో కూడా బాధితులు చెప్పిన పాయింట్లను సీరియస్‌గా రాసుకున్నారు. చెప్పిన వివరాలన్నీ రాసుకున్న తర్వాత ఉద్దానం బాధితురాలిని ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. అప్పుడే జరగకూడనిది జరిగిపోయింది. అందరూ ఫోటోలు తీసేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పుస్తకంలోని ఒక పేజీ కూడా జనసేన సోషల్ మీడియా అఫీషియల్ పేజీల్లో వచ్చింది.
janasena
అది బాధితులు ఏం చెప్పారో లేదా ఏమి చెయ్యాలో రాసుకున్న పేజీ అన్నమాట. సహజంగానే పవన్ కళ్యాణ్ ఏమి రాసుకున్నారన్న ఉత్సుకత అందరికీ వస్తుంది.. ఫోటోను జూమ్ చేసి చూసుకున్నారు. అందులో.. ఉన్నదేమిటంటే.. చీపురుపల్లి, పుచ్చకాయలు, ఐదు ఎకరాలు, బిర్యానీ, పార్వతి, లక్ష , ఇల్లు.. వీటిలో కొన్నింటికి రౌండప్‌లు…పిచ్చిగీతలు. అర్థం పర్థం లేని మరికొన్ని రాతలు ఉన్నాయి. ఆయన రాసుకున్న చీపురుపల్లి, ఎక్కడో విజయనగరంలో ఉంది. దానికి అసలు తుపాన్ ఎఫెక్ట్ లేదు. ఆయన వచ్చింది ఉద్దానం మరి చీపురుపల్లి అని ఎందుకు రాసుకున్నారో..? ఇంకా విశేషం ఏమిటంటే ఈ బిర్యానీ ఏంటో లక్ష ఏంటో ఎంత ఆలోచించినా నా బుర్రకి అయితే అస్సలు అర్ధం కాలేదు.
pawan-janasena
ఇప్పుడు ఆయన రాసుకున్న ఈ చీపురుపల్లి, పుచ్చకాయలు, ఐదు ఎకరాలు, బిర్యానీ, పార్వతి, లక్ష , ఇల్లు.. వీటిలో కొన్నింటికి రౌండప్‌లు…పిచ్చిగీతలు ఒక నివేదిక చేసి గవర్నర్ కి ఇచ్చి ఉంటారు. ఎటూ ఆయన కేంద్రానికి పంపొచ్చేది లేదు, వాళ్ళు సాయం చేసేదీ లేదు. ఎందుకంటే రాష్ట్రాల మీద అంత ప్రేమ ఉన్న వారే అయితే తితలీ ఇంత నష్టం కలిగిస్తే కార్యాలయం ఓపెనింగ్ కి గుంటూరు వచ్చిన  రాజనాద్ సింగ్ కి శ్రీకాకుళం వెళ్ళాలన్న ఆలోచన రాదా ?  పవన్ నివేదిక తయారుచేయడం, దానిని గవర్నర్ కు ఇవ్వడం, ఆయన దానిని కేంద్రానికి పంపుతాననడం అంతా అదేదో సినిమాలో పాటలాగా బ్రాంతియేనా ? అనిపిస్తోంది.