Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వెండితెర మీద క్రమంగా హద్దులు చెరిగిపోతున్నాయి. హీరో, హీరోయిన్ మధ్య ముద్దులు కాస్త శృతిమించి లిప్ టూ లిప్ కిస్ లు గా పరిణామం చెందాయి. తాజాగా తమిళ్ నుంచి తెలుగులో డబ్ అవుతున్న గృహం సినిమా లోను హీరో సిద్ధార్థ, హీరోయిన్ ఆండ్రియా ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ట్రైలర్ లో వచ్చిన ఓ లిప్ కిస్ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బయటికి వచ్చిన సీన్ కాకుండా సినిమాలో ఇంకో రెండుమూడు ఇలాంటివే సీన్స్ ఉన్నాయని చిత్ర యూనిట్ సెలెక్టెడ్ గా లీకేజ్ ఇస్తోంది. అయినా ఓ హారర్ మూవీ లో ఇన్ని లిప్ టూ లిప్ కిస్ లు అవసరమా అని ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషయం మీద దర్శకనిర్మాతలు నోరు మెదపలేదు గానీ స్వయంగా హీరోయిన్ ఆండ్రియా రంగంలోకి దిగింది.
లిప్ టూ లిప్ కిస్ మీద పెద్ద రచ్చ చేయడంలో అర్ధం లేదని ఒక్క మాటతో తేల్చేసింది. దీనికి భలే రీజనింగ్ కూడా ఇచ్చింది. ఈ కాలంలో బయట ఎక్కడ చూసినా కుర్రకారు లిప్ టూ లిప్ పెట్టుకుంటూ కనిపిస్తున్నారని అదే సీన్ వెండితెర మీద కనిపిస్తే ఇంత రాద్ధాంతం అవసరమా అని ఆండ్రియా ఎదురు ప్రశ్నిస్తోంది. అక్కడితో ఆగకుండా అసలు మన ఇళ్లలో లిప్ టూ లిప్ కిస్ పెట్టుకోరా అని పెద్ద ఆరిందాలా అడిగేసింది. నిజమే ఈ అమ్మడు అడిగిన దానిలో కొంత నిజం లేకపోలేదు. కానీ ఒంటరిగా వున్నప్పుడు, పదిమందిలో వున్నప్పుడు, వందల మంది చూసేటప్పుడు ఒకే విధంగా ఉండటం సాధ్యమా అని అమ్మడు ఆలోచించుకోవాలి. సినిమా పబ్లిసిటీ కోసం ఇప్పుడు ఏదో ఒకటి అనేస్తే రేపు ఇదే మాట ఇంకోరకంగా ఇబ్బందులు తెచ్చే ప్రమాదం లేకపోలేదు.