టీడీపీ పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం

టీడీపీ పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో అటు ప్రభుత్వానికి మరియు ప్రజలందరికి మధ్యన జరుగుతున్నటువంటి రచ్చ రోజు రోజుకి చాలా పెరిగిపోతుంది. కాగా రాష్ట్ర రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపించడంపై రాష్ట్ర అధికార వైసీపీ వర్గాలు అన్ని కూడా ప్రతిపక్ష టీడీపీ పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని సమాచారం. కేవలం ప్రతిపక్ష టీడీపీ వల్లే రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రక్రియ ఆగిపోతుందని వైసీపీ వర్గాలు అన్ని కూడా నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వైసీపీ నేతలు విశాఖపట్టణంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇంటి ముందు వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.

టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు ఒక విశాఖ వాసి అయి ఉండి కూడా, విశాఖపట్టణానికి రాజధాని వస్తుంటే వ్యతిరేకిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా అంతేకాకుండా వెలగపూడి ఇంటి ముందు బైఠాయించి పెద్ద ధర్నా చేస్తున్నారు. చివరికి విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి, ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడున్న వైసీపీ కార్యకర్తలు మరియు పోలీసుల మధ్యన తోపులాట జరిగింది. ఈ తరుణంలో అక్కడ తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.