వైసీపీ నేతల అసహనానికి కారణం

వైసీపీ నేతల అసహనానికి కారణం

శాసన మండలిలో జరిగిన సంఘటన వైసీపీ నేతల అసహనానికి కారణం అయిందని చెప్పాలి. టీడీపీ నేతలలో యనమల ప్రదర్శించిన తీరుతో బిల్లు కాస్త సెలెక్ట్ కమిటీకి చేరింది. అయితే టీడీపీ నేతలు యనమల అనుభవం, పరిజ్ఞానం వలనే ప్రజా గెలుపు సాధించామని చంద్రబాబు తెలిపిన విషయం అందరికి తెలిసిందే. అయితే వైసీపీ నేతలు మాత్రం ప్రస్తుతం యనమల ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. స్పీకర్ గా వున్నపుడు ఎన్టీఆర్ కి సభలో మైక్ ఇవ్వకుండా చేసిన యనమల అంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

శాసన మండలి లో జరిగిన పరిణామాలను బ్లాక్ డే గా మేధావులు, ప్రజలు భావిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. తాను తప్పు చేస్తున్నట్లు శాసనమండలి చైర్మనే ఒప్పుకున్నారన్న విషయాన్నీ గుర్తు చేసారు. చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో, 13 జిల్లాలకు విలన్ అంటూ పేర్కొన్నారు. పనికిరాని వారిని శాసనమండలిలో కుర్చోపెట్టారని, కొబ్బరి చిప్పలు అమ్ముకొనే బుద్ధా వెంకన్న ని శాసన మండలిలో కూర్చుపెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను మేధావినంటూ వరుసగా ఓడిపోయిన యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్సీ చేసారని విమర్శించారు. స్పీకర్ గా యనమల చేసిన కుట్రలు పైనున్న ఎన్టీఆర్ కి తెలుసనీ, రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్ కి సభలో మైక్ ఇవ్వని మీరా రూల్స్ గురించి మాట్లాడేది అని సంచలన వ్యాఖ్యలు చేసారు.