రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘కల్కి’. హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని ఇటీవల శ్రీ సత్యసాయి ఆర్ట్ పతాకంపై నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ తన అభిమానులకు ‘కల్కి’ చాలా బాగా నచ్చిందని. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ బాగున్నాయని అంటున్నారని, సినిమా బాగా నచ్చిందని అభిమానులు ఫోన్ చేస్తుంటే నాకెంతో సంతోషంగా అనిపిస్తోందని ఆయన అన్నారు. సినిమాలో నేను రెండుసార్లు ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి’ అనే డైలాగ్ చెబుతానని, కమర్షియల్ ట్రైలర్ విడుదల తర్వాత ఆ డైలాగ్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఓ రోజు ఈ డైలాగ్ చెప్పే సన్నివేశాన్ని తీస్తున్నప్పుడు జీవిత సెట్‌కి వచ్చింది. ‘ఇది మీ డైలాగే కదా’అని ఆమె చెప్పడంతో అప్పుడు తనకి ఈ విషయం గుర్తొచ్చి నవ్వానని అన్నారు. ఇక ఈ సినిమా చూసిన మా అమ్మాయిలు ఇద్దరూ మెచ్చుకున్నారని, వాళ్ల స్నేహితులకు కూడా ఈ సినిమా నచ్చడంతో వారు మరింత సంతోషపడుతున్నారని అన్నారు. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ కోణంలో కథను చెప్పడమనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ విధంగా కథ చెప్పడం వల్లే క్లైమాక్స్‌కు అంత పేరు వచ్చింది. చాలామంది ప్రేక్షకులు అలా చెప్పడం వల్ల థ్రిల్ ఫీలవుతున్నారని అన్నారు. ఇక విలన్‌గా చేయడానికి సిద్ధమేనని కానీ ‘ధృవ’లో అరవింద్ స్వామి చేసిన విలన్‌లాంటి క్యారెక్టర్ అయితే చేస్తా. రెగ్యులర్ విలన్ రోల్స్ చేయనని అన్నారు. అరవింద సమేత వీరరాఘవ, శ్రీమంతుడు చిత్రాల్లో జగపతిబాబు చేసిన పాత్రలు కూడా నాకు నచ్చాయని, అటువంటి పాత్రలు వచ్చినా చేస్తానని అన్నారు. మా అమ్మాయిలు శివాని, శివాత్మిక ఇద్దరూ రెండు, మూడు సినిమాలు చేసిన తర్వాత మేం కలిసి సినిమా చేస్తాం. అందులో జీవిత కూడా నటిస్తుంది. మా పిల్లలు ఇద్దరూ నాకు ఓ కథ చెప్పారు. చాలా బాగుంది. సి. కళ్యాణ్‌కు ఈ కథ చెబితే ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తానన్నారు. కుటుంబకథా చిత్రమని అన్నారు. ఇక తన తర్వాతి సినిమా ప్రవీణ్ సత్తారు ‘గరుడవేగ 2’ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని ఇది కాక మరికొన్ని కథలు వింటున్నామని ఆయన అన్నారు.