Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ తన 101వ చిత్రం ‘పైసా వసూల్’ సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో జోరు మీదున్నాడు. 101వ చిత్రం విడుదలకు ముందే 102వ చిత్రం షూటింగ్‌ను షురూ చేసిన బాలయ్య తాజాగా 103వ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. బాలయ్య 103వ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తాడని అంతా భావించారు. బాలయ్య కూడా అదే అనుకున్నాడు. కాని బోయపాటితో కాకుండా బాలయ్య తన తర్వాత సినిమాను యువ దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేసేందుకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. ‘పటాస్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన అనీల్ రావిపూడి ఆ వెంటనే బాలయ్యకు ఒక కథ చెప్పాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు.
‘పటాస్’ సినిమా తర్వాత అనీల్ రావపూడి దర్శకత్వంలో ‘సుప్రీం’ చిత్రం వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుని తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. ఇక ప్రస్తుతం రవితేజ హీరోగా ‘రాజా ది గ్రేట్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గుడ్డివాడు అయిన హీరో పాత్రను దర్శకుడు అనీల్ రావిపూడి అద్బుతంగా చిత్రీకరించాడు అనే టాక్ వస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ అనీల్‌పై నమ్మకంను పెంచింది. అందుకే బాలయ్య స్వయంగా అనీల్ రావిపూడికి అవకాశం ఇచ్చాడు. అప్పటి కథలో చిన్న చిన్న మార్పులు చేసి అనీల్ రావిపూడి స్క్రిప్ట్‌ను సిద్దం చేయబోతున్నాడు. రవితేజతో తెరకెక్కిస్తున్న ‘రాజా ది గ్రేట్’ చిత్రం విడుదలైన తర్వాత బాలయ్య సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివర్లో వీరిద్దరి కాంబో సెట్స్ పైకి వెళ్లే యోచన ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.
మరిన్ని వార్తలు: