పిక్‌ : బాబోయ్‌ మరీ ఇంత సన్నబడినది ఏంటీ…?

Anjali Slim Look

తెలుగమ్మాయి అయినా కూడా తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది. తమిళంలో హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న తర్వాత తెలుగులో షాపింగ్‌ మాల్‌ అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ చిత్రం డబ్బింగ్‌ సినిమా అయినా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘జర్నీ’ అనే డబ్బింగ్‌ చిత్రంతో అంజలి మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. జర్నీ సినిమా వల్ల తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, గీతాంజలి ఇంకా పలు చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు తెలుగులో చేసిన చిత్రాలు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. దాంతో తమిళంలకే పరిమితం అయ్యింది. అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న ఈ అమ్మడు తాజాగా చాలా సన్నబడి కనిపించి చర్చనీయాంశం అయ్యింది.

heroin-anjali

అంజలి గత చిత్రంలో చాలా లావుగా కనిపించి విమర్శల పాు అయ్యింది. మరీ ఇంత లావు ఏంటీ అంటూ అంతా విమర్శలు చేసిన నేపథ్యంలో తదుపరి చిత్రం కోసం సన్నబడుతాను అంటూ ముందే నిర్ణయించుకుంది. అందుకోసం మూడు నెలల గ్యాప్‌ తీసుకుని ఏకంగా 15 కేజీల వరకు బరువు తగ్గింది. లావుగా ఉన్న సమయంలో బొద్దుగా, అందంగా ఉన్న అంజలి ఇప్పుడు మొహంలో అందం కనిపించకుండా పోయింది. గతంతో పోల్చితే సగానికి చిక్కిన అంజలి ఏమాత్రం ఆకట్టుకోలేక పోతుంది. ఆమె లుక్‌ పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గతంతో పోల్చితే ఇప్పుడు మరీ దారుణంగా ఉన్నావని, ఏమాత్రం అందంగా లేవని డైరెక్ట్‌గా అంటున్నారు. ఆమె ఇలా బక్కగా అవ్వడం కోసం చేసిన ప్రయత్నాలు చాలా కఠినం అయినవి. అంత కష్టపడి చేసిన ప్రయత్నాలు విఫలం అవ్వడంతో ఆమె కూడా నిరాశ వ్యక్తవం చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అంజలి తెలుగులో ఒకటి, తమిళంలో రెండు చిత్రాలను చేస్తున్న విషయం తెల్సిందే. సన్నబడటంతో అందం పోగొట్టుకున్న అంజలి మళ్లీ లావు అయ్యి అందంగా తయారు అవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Anjali