మరో నటుడిని బలితీసుకున్న కరోనా …

మరో నటుడిని బలితీసుకున్న కరోనా ...

మాయ‌దారి కరోనా మహమ్మారి బారిన‌ప‌డి మరో సెలబ్రిటీ మృత్యువాతపడ్డారు. కొద్దిరోజుల క్రితం స్టార్ వార్స్ నటుడు ఆండ్రూ జాక్ కరోనా వైరస్ కారణంగా మరణించడం జరిగింది. తాజాగా హాలీవుడ్‌ నటుడు అలెన్ గార్ఫీల్డ్‌ (80) కరోనా చికిత్స పొందుతూ మంగళవారం న్యూయార్క్‌లో కన్నుమూశారు.

ఈయన అలెన్.. నాష్‌విల్లే, ది స్టంట్‌​ వంటి గొప్ప చిత్రాల్లో నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు అమెచ్యూర్‌ బాక్సర్‌గా, స్పోర్ట్స్‌ రిపోర్టర్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లోని యాక్టర్స్ స్టూడియోలో ఎలియా కజాన్, లీ స్ట్రాస్‌బెర్గ్‌లతో కలిసి నటనలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం 1968 లో వచ్చిన 69 చిత్రంతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. విలన్‌ ప్రాత్రల్లోనే అధికంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇండియాలో సెలెబ్రిటీ సింగర్ కనికా కపూర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. లండన్ వెళ్లి వచ్చిన ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో రెండు వారాల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఇక ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా స్థంబించిపోగా ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 1.5 మిలియన్స్ కి చేరింది. ఇక ఇండియాలో ఈ సంఖ్య 5 వేలు దాటిపోయింది.