జంతువులకు కూడా కరోనా: పెంపుడు జంతువుల కోసం వెటర్నరీకి క్యూ

కరోనా వ్యాధి మనుషులతో పాటు జంతువులకి కూడా వస్తుంది అని తేలడంతో బెజవాడ జనం వణికిపోతున్నారు. తమ పెంపుడు జంతువులతో వెటర్నరి ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. పశువులు, కుక్కలు, మేకలు, పిల్లలకు పరీక్షలు నిర్వహించేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో వేల మంది చనిపోయారు. అయితే ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకే కాకుండా మనుషుల నుంచి జంతువులకి కూడా వస్తుందని నిపుణులు చెప్తున్నారు.

అమెరికాలో చూసుకున్నట్లయితే న్యూయార్క్ లో ఒక పులికి జూలో కరోనా వ్యాధి సోకినట్టు తేలింది. అయితే ప్రస్తుతం ఇండియాలో కూడా అదే పరిస్థితి నెలకొంటోందా? అనే ప్రశ్నకు చాలా మంది వైద్యులు కాదని అంటున్నారు. అది ప్రభుత్వం నుంచి నిర్ధారించవలసిన అవసరం అయితే ఉంది. ఒక కేసు అయితే పులికి వచ్చిందన్నారు కానీ… ఇంకా సైంటిఫిక్ గా నిర్థారణ కాలేదని పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ సుభాకరరావు గారు తెలిపారు. అయితే ఇది ఎంతవరకు యానిమల్స్ నుంచి మనుషులకి వస్తది అనేది ఇంకా తేలవలసి ఉందని.. సైంటిఫిక్ గా రీసెర్చ్ జరుగుతుందని పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ సుభాకరరావు తెలియజేశారు.

కాగా ప్రస్తుతానికి అయితే కుక్కలకు కరోనా అంతా స్ప్రెడ్ అవుతుందనేది ఏమి లేదని.. సైంటిఫిక్ గా కూడా అది ప్రూవ్ కాలేదని.. ప్రూవ్ కాకుండా మాట్లాడటం అనేది మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. డెఫినెట్ గా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారని అలాంటిది ఏదైన ఉందని తెలిస్తే మేము ప్రికాషన్స్ ఇస్తామని ఆయన వెల్లడించారు.

కాగా దేశంలో నాలుగు యానిమల్ హజ్ బెండ్రీకి సంబంధించిన ఇనిస్టిట్యూట్ లో జంతువులకి సంబంధించి టెస్టులు చేయడానికి కూడా ఏర్పాట్లు చేసింది. అక్కడ పూనే, భోపాల్ కి సంబంధించి ఇంకా ఉత్తరప్రదేశలో కూడా ఈ ఇనిస్టిట్యూట్లను ప్రారంభించింది. అయితే దేశవ్యాప్తంగా ఎలాంటి లక్షణాలున్నా వెంటనే టెస్టులు చేస్తున్నట్లు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.