రాఘవ లారెన్స్. చంద్రముఖి పాత్ర కోసం, కంగనా కన్నా ముందు కాజల్ ని అనుకున్నారు, కానీ వీళ్లిద్దరి కన్నా ముందు ఇంకో అద్భుత నటి చెయ్యాల్సి వుంది, కానీ చెయ్యలేదు., ఎవరామె, ఎందుకు చెయ్యలేదు….సీనియర్ దర్శకుడు పి వాసు, రాఘవ లారెన్స్ కథానాయకుడిగా ‘చంద్రముఖి 2’ విడుదలకి సిద్ధం అవుతోంది. ఇది అప్పుడెప్పుడో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకి సీక్వెల్ గా వస్తోంది అని అంటున్నారు. ఇందులో చంద్రముఖి గా కంగనా రనౌత్ నటిస్తోంది.
ఆమె కన్నా ముందు దర్శకుడు కాజల్ అగర్వాల్ ని అనుకున్నారు, ఆమె కూడా చెయ్యడానికి ఒప్పుకుంది, కానీ ఆమె తేదీలు సరిగ్గా ఈ సినిమాకి కుదరక పోవటంతో ఆమె తప్పుకుంది. ఆమె స్థానంలో కంగనా రనౌత్ వచ్చింది. ఈ సినిమా చాలా భాగం హైద్రాబాదులోని రామోజీ ఫిలిం స్టూడియోలోనే చిత్రీకరించారు. అయితే కాజల్ ,కంగనా కన్నా ముందు ఈ సినిమాలో చంద్రముఖి పాత్ర కోసం ఇంకో నటిని సంప్రదించారు అని తెలిసింది .
ఆమ్ మరెవరో కాదు సాయి పల్లవి ఉన్న నటీమణులో సాయి పల్లవి ఎటువంటి నటి అన్నది అందరికి తెలిసంది సాయి పల్లవి దగరికి వెళ్లి ముందు ఈ చంద్రముఖి 2 కథ గురించి చెప్పారు అని తెలిసింది . ఆమెకి కూడా ఈ పాత్ర చాలా బాగా నచ్చింది, చేస్తాను అని కూడా చెప్పింది అయితే ఆమె పతాక సన్నివేశాలు చాలా చిన్న మార్పు ఏదో అడిగింది.
అని తెలిసింది అయితే దర్శకుడు ఆమెకి చెప్పి ఒప్పించవచ్చు కానీ ఎందుకో మరి అది జరగలేదు సాయి పల్లవి కూడా మరి దాని గురించి మాట్లాడలేదు అని తెలిసింది అలా ఈ సినిమా ఆమె చేయాల్సింది, ఎందుకో వేరే వాళ్ళకి వెళ్ళింది అని తెలిసింది. ‘చంద్రముఖి’ మొదటి పార్టులో జ్యోతిక చాలా అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించింది.ఒకవేళ సాయి పల్లవి కనుక చేసి ఉంటే ఈ సినిమా ఇంకో రేంజ్ లో ఉండేది అని తమిళ చిత్ర పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది.