భారత్ కు ఆఫర్: రిలయన్స్ జియోలోకి మరో అమెరికా కంపెనీ భారీ పెట్టుబడి

అమెరికాకు చెందిన ప్రయివేటుఈక్విటీ కంపెనీ సిల్వర్ లేక్ మన దేశపు జియో ప్లాట్‌ఫామ్స్‌లలో రూ.5,655.75 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 1.15 శాతం వాటాను దక్కించుకోనుంది. రూ.4.90 లక్షల వాల్యూతో ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతోంది. అయితే ఈ మధ్య ఫేస్‌బుక్ జియోలో 9.9 శాతం వాటాను రూ.43,574 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ పెట్టుబడులపై రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ఈ రోజు ప్రకటన చేశాయి.

అదేవిధంగా ‘సిల్వర్ లేక్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.5,655.75 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రకటించాయి. రూ.4.90 లక్షల కోట్ల వాల్యూ వద్ద పెట్టుబడులు పెడుతున్నారు.’ అని రెండు సంస్థలు ఓ ప్రకటన రూపంలో వెల్లడించారు.

అంతేకాకుండా జియో ప్లాట్ ఫామ్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. జియో ప్లాట్‌ఫాం నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీపై దృష్టి సారించింది. రిలయన్స్ జియో ఇన్‌ఫోకామ్ ద్వారా 388 మిలియన్లకు పైగా కనెక్టివిటీని అందించే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. జియో ప్లాట్ ఫాం అనుబంధంగా ఉంది. కాగా టెక్నాలజీ, ఫైనాన్స్ సెక్టార్‌లో సిల్వర్ లేక్‌కు మంచి సంస్థగా పేరుందని, అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థల ద్వారా ఇండియాను మరింత డిజిటల్ సొసైటీని మార్చడమే తమ లక్ష్యమని, ఈ ఒప్పందానికి సంతోషిస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు