కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆర్టీసీ కార్పొరేషన్ దగ్గర కార్మికులకు జీతాలు చెల్లించేంత సొమ్ము లేదని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదించారు. ఆర్టీసీ కార్పొరేషన్ దగ్గర కేవలం రూ. 7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కార్మికులకు జీతాలు చెల్లించాలంటే రూ. 224 కోట్లు కావాలని అడ్వకేట్ జనరల్ అన్నారు. దీనిపై నేడు మధ్యాహ్నం మరోసారి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. గతంలో దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు… సోమవారం లోపు ఆర్టీసీ ఉద్యోగులు సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది.
ట్రెజరీలో సిబ్బంది లేకపోవడం వల్లే జీతాలు ఇవ్వలేదని గతంలో ఆర్టీసీ యాజమాన్యం వాదించింది. అయితే ప్రస్తుతం కార్పొరేషన్ దగ్గర డబ్బులు లేవు అని ప్రభుత్వం వాదించింది. అక్టోబర్ 5 నుంచి సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు… సెప్టెంబర్ నెల జీతాలను ఆర్టీసీ యాజమాన్యం చెల్లించని సంగతి తెలిసిందే. మరోవైపు ఈ విషయంలో కోర్టును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆర్టీసీ జేఏసీ అశ్వత్ధామరెడ్డి అన్నా