తెలుగు సినీ పరిశ్రమలో మరొక విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ హాస్య నటుడు అలీ తల్లి గారైన జైతున్ బీబీ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కాగా గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి అలీ తల్లి జైతున్ బీబీ రాజమహేంద్రవరంలో నేడు ఉదయం తుదిశ్వాస విడిచారు. అయితే షూటింగ్ కొరకై రాంచీలో ఉన్నటువంటి అలీ, తన తల్లి మరణ వార్త తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్ కి బయలుదేరారు. ఇకపోతే అలీ తల్లి మృతదేహాన్ని హైదరాబాద్ కి తరలించడానికి బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈరోజు సాయంత్రం అలీ తల్లి గారైన జైతున్ బీబీ కి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.