“సరిలేరు నీకెవ్వరూ” నుండి మరో సర్‌ప్రైజ్‌

Another Surprise from Sarileru neekevvaru

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు సరిలేరు నీకెవ్వరు సినిమా యూనిట్. భరత్ అనే నేను, మహర్షి వరుస బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘F2’ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక మందనా, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈరోజు స్వతంత్ర దినోత్సవం ఆ సినిమా నుండి టైటిల్ సాంగ్‌ ను విడుదల చేశారు. ఈ సాంగ్‌ ను సైనికులకు డెడికేట్ చేస్తూ సైనికుడిగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. దేశ సరిహద్దుల్లో సైనికులు దేశం కోసం ఎలా పోరాడుతున్నారో విజువల్‌గా చూపించారు.

‘భగభగమండే నిప్పుల వర్షం వచ్చినా…జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు’ అంటూ సాగిన ఈ పాటలో ఇండో పాక్ వార్ 1971, కార్గిల్ వార్ నాటి పరిస్థితుల్ని గుర్తు చేశారు. ఇందులో మహేష్ బాబు మేజర్ అజయ్ క్రిష్ణగా కనిపించారు.

అయితే ఈ టైటిల్ సాంగ్‌ను సినిమా పరంగా అంత గొప్పగా కంపోజ్ చేయలేకపోయారు దేవి శ్రీ ప్రసాద్. లిరిక్స్‌ కూడా ఏదో అలా ఉన్నాయి. మొక్కుబడిగా ట్యూన్స్ కట్టినట్టుగా అనిపించింది.