భారీగా పడిపోయిన బంగారం ధర!

huge-drop-in-gold-price

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2,490 తగ్గుదలతో రూ.37,000కు పతనమైంది. అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉన్నా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

అదే సమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.360 తగ్గుదలతో రూ.35,760కు దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం అక్కడే స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.47,265 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.29 శాతం పెరుగుదలతో 1,532.15 డాలర్లకు చేరింది.

అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 17.32 డాలర్లకు ఎగసింది. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గుదలతో రూ.37,700కు క్షీణించింది.